Chiyaan Vikram : పాన్ ఇండియా రైటర్ విజయంద్ర ప్రసాద్ కథలో చియాన్ విక్రమ్..నిజమెంత?
తమిళ్ వెర్సటైల్ హీరో చియాన్ విక్రమ్ త్వరలో పాన్ ఇండియా రైటర్ విజయంద్ర ప్రసాద్ రాసిన కథలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. విక్రమ్ నటించిన పలు చిత్రాలు తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి ప్రజాధారణ పొందుతూ వచ్చాయా..........
- gum 95921
- Published On : August 31, 2022 / 02:20 PM IST
Chiyaan Vikram in Pan India Vijayendra Prasad's Story..
Chiyaan Vikram : తమిళ వర్సెటైల్ హీరో చియాన్ విక్రమ్ త్వరలో పాన్ ఇండియా రైటర్ విజయంద్ర ప్రసాద్ రాసిన కథలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. విక్రమ్ నటించిన పలు చిత్రాలు తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి ప్రజాదరణ పొందుతూ వచ్చాయి. ఇప్పుడు అయిన నటించిన ‘కోబ్రా’ నేడు థియేటర్ లలో సందడి చేయబోతుంది. దాదాపు రూ.90కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కిన ఈ చిత్రంపై విక్రమ్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడిలో కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
Cobra Movie Promotions : హైదరాబాద్ లో కోబ్రా మూవీ ప్రమోషన్స్ హంగామా
అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, కే.జి.ప్ ఫేమ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి విక్రమ్ సరసన నటించింది. అయితే ఈ చిత్రంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు మన అందరకి తెలిసిందే. ఇంక విక్రమ్ ఈ చిత్రంలో పలు విభిన్నమైన గెటప్స్ లో కనబడబోతున్నట్లు ట్రైలర్ లో చూపించారు. అపరిచితుడు తరవాత సరైన హిట్ లేని విక్రమ్ కి ఈ చిత్రం ఎంతటి విజయాన్ని ఇస్తుందో వేచి చూడాల్సిందే.
Cobra Trailer: కోబ్రా ట్రైలర్.. మరోసారి విజృంభించిన విక్రమ్!
ఇది ఇలా ఉండగా విక్రమ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం పొన్నియిన్ సెల్వన్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తరువాత కూడా తన కెరీర్ లో భారీ సినిమాలే చేస్తున్నట్లు తెలిపాడు. ఆ వరుసలోనే పాన్ ఇండియా రైటర్ విజయేంద్ర ప్రసాద్ తో ఒక సినిమా ఉండబోతున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. తన కోసం విజయంద్ర ప్రసాద్ ఒక సెన్సేషనల్ కథని రెడీ చేసారని అది ఒక మాస్ సబ్జెక్ట్ కధాంశం అని తెలిపాడు. ఈ న్యూస్ విన్న చియాన్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
