Cobra Trailer: కోబ్రా ట్రైలర్.. మరోసారి విజృంభించిన విక్రమ్!

తమిళ విలక్షణ హీరో విక్రమ్ సినిమా వస్తుందంటే, కేవలం తమిళ ప్రేక్షకులే కాకుండా తెలుగు ఆడియెన్స్ కూడా ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోబ్రా విషయంలోనూ అదే రీతిలో అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Cobra Trailer: కోబ్రా ట్రైలర్.. మరోసారి విజృంభించిన విక్రమ్!

Chiyaan Vikram Cobra Trailer Impressive

Cobra Trailer: తమిళ విలక్షణ హీరో విక్రమ్ సినిమా వస్తుందంటే, కేవలం తమిళ ప్రేక్షకులే కాకుండా తెలుగు ఆడియెన్స్ కూడా ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మిగతా హీరోల మాదిరిగా కాకుండా, విక్రమ్ సినిమాలో కొత్తదనం గ్యారెంటీగా ఉంటుందనే మార్క్ వేసుకున్నాడు ఈ హీరో. అందుకే విక్రమ్ సినిమా అంటే ఆడియెన్స్ ఖచ్చితంగా కొత్తదనాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇప్పుడు విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోబ్రా విషయంలోనూ అదే రీతిలో అంచనాలు నెలకొన్నాయి.

Cobra Movie: కోబ్రా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన దగ్గర్నుండీ, విక్రమ్ ఈ సినిమాలో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్ మొదలుకొని, ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అంకెలతో చెడుగుడు ఆడే ఓ వ్యక్తి, వ్యవస్థలో ఉన్న అన్యాయాలను, అక్రమాలను ఎలా రూపుమాపాడనేది ఈ సినిమా కథగా మనకు చూపించబోతున్నట్లుగా ఈ చిత్ర ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

Cobra Movie: మళ్లీ వెనక్కి వెళ్లిన కోబ్రా.. ఎప్పుడొస్తున్నాడంటే..?

అయితే ఈ సినిమాలో విక్రమ్ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడు విభిన్న పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమా కథ ఎలాంటి మలుపులతో వస్తుందా.. ఈ సినిమాలో విక్రమ్ డిఫరెంట్ గెటప్స్‌లో ఎలాంటి వేరియేషన్స్ చూపించాడా అనే ఆతృత ప్రేక్షకుల్లో నెలకొంది. కేజీయఫ్ ఫేం బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నాడు. ఆగస్టు 31న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.