Chiyaan Vikram Thangalaan movie team visits Vijayawada Babai hotel
Chiyaan Vikram : తెలుగు ప్రేక్షకులకు చియాన్ విక్రమ్ గురించి చెప్పాల్సిన పని లేదు. అపరిచితుడు, ఐ వంటి సినిమాలతో ఆయనకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ క్రమంలో ఆయన నటించిన సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ విడుదల అవుతుంటాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం తంగలాన్. పా.రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో విజయవాడలో చిత్ర బృందం సందడి చేసింది. సోమవారం ఉదయం నగరంలో పేరు పొందిన బాబాయ్ హోటల్లో టిఫిన్ చేసింది. ఈ విషయం తెలిసి వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడకు చేరుకున్నారు. అక్కడి వచ్చిన వారితో చిత్ర బృందం మాట్లాడింది.
ఇడ్లీ చాలా స్మూత్ గా ఉందని విక్రమ్ అన్నారు. అయితే సాంబార్ లేనిలోటు ఉందని, చట్నీ మాత్రం అదుర్స్ అని చెప్పారు. ఐదు బాషల్లో తంగలాన్ సినిమాని ఆగస్టు 15 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చెప్పారు. తాను ఈ సినిమాలో ఓ సరికొత్త క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు తెలిపారు. దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి తీశారన్నాడు. థియేటర్లలో అడుగుపెట్టిన ప్రేక్షకులు మరో అద్భుత ప్రపంచంలోకి వెళ్తారని చెప్పారు.
శివ పుత్రుడు, అపరిచితుడు, ఐ,నాన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని, తంగలాన్ను కూడ ఆదరిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నాడు. కుటుంబ సమేతంగా ఈ మూవీని చూడొచ్చనని చెప్పారు. యాక్షన్ సన్నివేశాల కోసం హీరోయిన్ మాళవిక మోహనన్ ఎంతో కష్టపడిందని, లండన్ నుంచి వచ్చిన డేనియల్ ఈ చిత్రంలో ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారని, అతడి నటన అద్భుతంగా ఉందన్నారు. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ ఈ చిత్రానికి ప్రాణం పోశారన్నాడు. ఈ సినిమా షూటింగ్లో ప్రక్కటెముకలు విరిగాయని, ఆపరేషన్ చేయించుకొని వచ్చి క్లైమాక్స్రీ షూట్ లో పాల్గొన్నట్లుగా విక్రమ్ చెప్పాడు.
మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. విక్రమ్‌తో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనను విక్రమ్ ఎంతో ప్రోత్సహించారన్నారు. ఫైటర్ గా ప్రేక్షకులకు కనిపిస్తాననని, ప్రేక్షకులకు అవన్నీ బాగా నచ్చుతాయని చెప్పుకొచ్చింది.
Mufasa: The Lion King : ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ట్రైలర్ రిలీజ్.. షారుఖ్, అతని పిల్లల వాయిస్‌లతో..