Chiyaan Vikram : విక్రమ్ కొత్త సినిమా టీజర్ రిలీజ్.. సినిమాలు లైన్‌లో ఉన్నా.. రిలీజ్ అవ్వడం లేదేంటి..!
చియాన్ విక్రమ్ సినిమా షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు గాని, ఆ చిత్రాలు రిలీజ్ అవ్వడం లేదు. ఇది ఇలా ఉంటే, విక్రమ్ మరో కొత్త సినిమా టీజర్ తో వచ్చేసారు.
- gum 95921
- Published On : April 17, 2024 / 08:05 PM IST
Chiyaan Vikram Veera Dheera Sooran Title Teaser released
Chiyaan Vikram : తమిళ విలక్షణ నటుడు విక్రమ్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నారు. కానీ అవి రిలీజ్ కి మాత్రం నోచుకోవడం లేదు. ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్స్ ని పూర్తి చేసి, రిలీజ్ సిద్ధం చేసిన విక్రమ్.. అనుకోని కారణాల వల్ల వాటి విడుదలని పోస్టుపోన్ చేశారు. అవి థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తాయో అన్నది ఇప్పటికి క్లారిటీ లేదు. ఇది ఇలా ఉంటే, విక్రమ్ మరో కొత్త సినిమా టీజర్ తో వచ్చేసారు.
రీసెంట్ గా సిద్దార్థ్ తో ‘చిన్నా’ సినిమాని తెరకెక్కించిన ఎస్ యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో విక్రమ్.. ‘వీర ధీర సూరన్’ అనే సినిమాని చేస్తున్నారు. నేడు విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ యాక్షన్ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. దాదాపు 4 నిముషాలు పాటు ఉన్న ఈ యాక్షన్ టీజర్ మూవీ పై మంచి అంచనాలు క్రియేట్ చేసేలా ఉంది. మీరు ఆ టీజర్ ని చూసేయండి.
Also read : Nabha Natesh : ప్రభాస్ వాయిస్‌తో డబ్‌స్మాష్ చేసిన నభా నటేష్.. వీడియో వైరల్..
కాగా విక్రమ్ నటించిన ధ్రువ నక్షత్రం, తంగలాన్ సినిమాలు ఇప్పటికే ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు రిలీజ్ వరకు వచ్చి వాయిదా పడ్డాయి. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ధ్రువ నక్షత్రం అయితే కొన్నేళ్ల నుంచి వాయిదా పడుతూనే వస్తుంది. ఇక పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన తంగలాన్ మూవీ జనవరిలో రిలీజ్ చేస్తామంటూ ముందుగా అనౌన్స్ చేశారు. కానీ రిలీజ్ చేయలేదు. నేడు బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు గాని రిలీజ్ డేట్ తెలియజేయలేదు.
