Nabha Natesh : ప్రభాస్ వాయిస్‌తో డబ్‌స్మాష్ చేసిన నభా నటేష్.. వీడియో వైరల్..
ప్రభాస్ వాయిస్‌తో డబ్‌స్మాష్ చేసి ఆకట్టుకుంటున్న నభా నటేష్. వైరల్ అవుతున్న ఆ వీడియోని చూశారా..?

Nabha Natesh dubsmash with Prabhas Voice is gone viral
Nabha Natesh : నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైన కన్నడ భామ నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. అయితే అదే సమయంలో ఆమె యాక్సిడెంట్ కి గురి అవ్వడం, ఆ తరువాత కరోనా రావడంతో మూడేళ్లపాటు సినిమాల్లో కనిపించలేదు. ఇక ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో అవకాశాలు కూడా ఎదురు చూస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
ఈక్రమంలోనే మొన్నటివరకు అదిరిపోయే ఫోటోషూట్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ వచ్చిన ఈ భామ.. ఇప్పుడు ప్రభాస్ వాయిస్‌తో డబ్‌స్మాష్ వీడియో చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. డార్లింగ్ అనే పదం ప్రభాస్ కి ఊతపదం అనేది అందరికి తెలిసిందే. సినిమా ఈవెంట్స్ లేదా టీవీ షోల్లో ఎక్కడ కనిపించిన ప్రభాస్ డార్లింగ్ అనే పదంతోనే ఎక్కువుగా మాట్లాడుతుంటారు.
Also read : Samyuktha : నిస్సహాయులైన మహిళల కోసం ‘ఆదిశక్తి’గా మారుతున్న సంయుక్త మీనన్..
ఇక ఇప్పటివరకు ప్రభాస్ మాట్లాడిన కొన్ని ఫేమస్ డార్లింగ్ పదాలన్ని కలిపి ఓ డబ్‌స్మాష్ వీడియోని నభా నటేష్ చేశారు. ఆ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్.. నభా నటేష్ కి లవ్ యు డార్లింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ డార్లింగ్ వీడియోని మీరు కూడా చూసేయండి.
Hi Darlings❤️ How are you!! pic.twitter.com/CXHCVeOIqq
— Nabha Natesh (@NabhaNatesh) April 17, 2024
నభా నటేష్ సినిమాల విషయానికి వస్తే.. నిఖిల్ పాన్ ఇండియా సినిమా ‘స్వయంభు’లో ఓ ముఖ్య పాత్ర చేసే అవకాశాన్ని అందుకున్నారు. ఇటీవలే ఈ మూవీ సెట్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. అలాగే ప్రియదర్శి మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న సినిమాకి కూడా నభా సైన్ చేసినట్లు సమాచారం.