Samyuktha : నిస్సహాయులైన మహిళల కోసం ‘ఆదిశక్తి’గా మారుతున్న సంయుక్త మీనన్..

లైఫ్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న సంయుక్త.. నిస్సహాయులైన మహిళల కోసం 'ఆదిశక్తి'గా మారబోతున్నారు.

Samyuktha : నిస్సహాయులైన మహిళల కోసం ‘ఆదిశక్తి’గా మారుతున్న సంయుక్త మీనన్..

Samyuktha Menon launch Adishakti helping Service organization for womens

Samyuktha : కేరళ నటి సంయుక్త మలయాళ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకొని.. ఆ తరువాత తమిళ్, తెలుగు సినిమాల్లో మంచి అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతున్నారు. తెలుగులో ఇప్పటివరకు ఈ నటి నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్ తెలుగులో నిఖిల్ సరసన ‘స్వయంభు’ అనే సినిమా చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే.. సంయుక్త ఓ సేవా సంస్థను ప్రారభించబోతున్నారు. సింగల్ పేరెంట్ చైల్డ్ గా సంయుక్త.. లైఫ్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నారు. అయితే తనలా, తన తల్లిలా మరో మహిళ కష్టపడకూడదని ఆలోచించిన సంయుక్త.. ఆదిశక్తి అనే సేవా సంస్థని ప్రారంభించి కష్టాల్లో ఉన్న మహిళల జీవితానికి మార్గదర్శకం కాబోతున్నారు.

Also read : Teacher : #90s దర్శకుడి నుంచి రాబోతున్న మూవీ.. ‘స్వాతి టీచర్’ పోస్టర్ రిలీజ్..

నేడు శ్రీరామ నవమి సందర్భంగా ఈ ఆదిశక్తి సేవా సంస్థను అనౌన్స్ చేశారు. ఇక ఈ సంస్థ ద్వారా.. అన్ని వయసుల మహిళలకు విద్య, ఉపాధి, శిక్షణ, ఆరోగ్యం వంటి విషయాల్లో చేయూతని ఆనిన్చానున్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు, మహిళలు కూడా అన్ని రంగాల్లో తమ గొంతుని వినిపిస్తూ ఆత్మగౌరవంతో జీవించేలా ఈ సంస్థ పని చేస్తుందని సంయుక్త పేర్కొన్నారు. ఇక సంయుక్త తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.’

 

View this post on Instagram

 

A post shared by Samyuktha (@iamsamyuktha_)

ఇక స్వయంభు సినిమా విషయానికి వస్తే.. సోషియో ఫాంటసీ మైథలాజికల్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. బాలకృష్ణ ‘భైరవద్వీపం’ సినిమా తరహాలో ఈ చిత్రం ఉండబోతుందని నిఖిల్ తెలియజేసారు. ఈ సినిమాలో సంయుక్తతో పాటు నభా నటేష్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ మూవీతో నిఖిల్ మొదటిసారి వారియర్ రోల్ లో కనిపించబోతున్నారు.