Teacher : #90s దర్శకుడి నుంచి రాబోతున్న మూవీ.. ‘స్వాతి టీచర్’ పోస్టర్ రిలీజ్..
#90s దర్శకుడి నుంచి 'స్వాతి టీచర్' అనే మూవీ రాబోతుంది. నేడు శ్రీరామనవమి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

90s A Middle Class Biopic director new movie Swathi Teacher First look poster
Teacher : ఇటీవల ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజై బిగ్గెస్ట్ సూపర్ హిట్ అయిన తెలుగు వెబ్ సిరీస్ ‘#90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’. శివాజీ, వాసుకి, మౌళి తనూజ్ ప్రశాంత్, వాసంతిక, రోహన్ రాయ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ వెబ్ సిరీస్ తెలుగు ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ ని ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేశారు. ఈ సూపర్ హిట్ సిరీస్ తరువాత.. ఈ దర్శకుడి నుంచి ‘టీచర్’ అనే మూవీ రాబోతుంది.
ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ తో కనిపిస్తుంది. అలాగే స్కూల్ లవ్ కి సంబంధించిన సీన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక టైటిల్ చూస్తుంటే ఈ సిరీస్ అంతా స్కూల్ టీచర్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. ఇక ఈ టీచర్ పాత్రని స్వాతి పోషిస్తుంటే.. నిఖిల్ దేవాదుల, నిత్యశ్రీ, రాజేంద్ర గౌడ్, సిద్ధార్థ్, హర్ష, పవన్ రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని అంకాపూర్ గ్రామంలో ఒక ముగ్గురు డల్ స్టూడెంట్స్ చుట్టూ కథ తిరుగుతుందట. చదువు పక్కన పెట్టి బాగా అల్లరి చేసే వీరి లైఫ్ లోకి ఒక టీచర్ వచ్చాక ఏం జరిగింది అనేది కథ. సినిమా ఫుల్ కామెడీతో ఉండబోతుందట.
Also read : Satyam Rajesh : నాకు భారీ బడ్జెట్ సినిమాలు అవసర్లేదు.. నేను ఎవరితోనూ పోటీ పడి సినిమాలు చేయను..
మరి ఈ మూవీతో దర్శకుడు ఆదిత్య హాసన్ ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తారో చూడాలి. #90s ని నిర్మించిన నవీన్ మేడారం ఈ మూవీని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా #90s సిరీస్ ని కూడా సినిమాగా తీసుకు వస్తామని గతంలో ప్రకటించారు. మరి ఆ సిరీస్ ని భవిషత్తులో మూవీగా తీసుకు వస్తారా లేదా చూడాలి. ఆడియన్స్ అయితే ఈ సిరీస్ సెకండ్ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు.
Say hello to #Teacher & her class of brats!✨️
Get ready for a hilarious ride in the ???????? soon from the team of #90s ❤️#Swathi #AdityaHasan @NaveenMedaram @Rajashekarmedar @NikhilDevadula @Ursnityasri @az_dop @MNOPRODUCTIONS @AmoghaArts @adityamusic pic.twitter.com/gkubYhld0v
— Naveen Medaram (@NaveenMedaram) April 17, 2024