Sivaji Raja : టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటుడు శివాజీ రాజాకి పితృ వియోగం..
నేడు టాలీవుడ్ లో విషాదం నెలకొంది.(Sivaji Raja)
sivaji raja
Sivaji Raja : నేడు టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఒకప్పటి హీరో, స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా తండ్రి నేడు మరణించారు.
సీనియర్ నటుడు శివాజీ రాజా తండ్రి జి. రామరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నేడు ఉదయం 8 గంటలకు మధురానగర్‌లోని స్వగృహంలో 85 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. వయోభారం కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
Also Read : Suma Kanakala : యాంకర్ సుమ కూతుర్ని చూశారా? లేటెస్ట్ ఫోటోలు వైరల్..
నేడు మధ్యాహ్నం 3 గంటల లోపు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శివాజీ రాజా తండ్రి మరణంతో ఆయన కుటుంబానికి సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
