Chor Nikal Ke Bhaga : అందులో RRR రికార్డ్ బద్దలుకొట్టిన బాలీవుడ్ సినిమా..

RRR సినిమా నెట్ ఫ్లిక్స్ లో కేవలం రెండు వారాల్లోనే 25 మిలియన్ హవర్స్ పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. RRR సినిమా తర్వాత ఏ ఇండియన్ సినిమా దీని దరిదాపుల్లోకి కూడా రాలేదు.

Chor Nikal Ke Bhaga : మన RRR సినిమా ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. దేశ విదేశాల్లో పెద్ద హిట్ అయి, కలెక్షన్స్ రాబట్టి ఏకంగా ఆస్కార్(Oscar) దాకా వెళ్లి నాటు నాటు(Naatu Naatu) పాటకు ఆస్కార్ కూడా సాధించింది. థియేటర్స్ లోనే రికార్డులు బద్దలు కొట్టడమే కాకా ఆ తర్వాత ఓటీటీలో(OTT) కూడా రికార్డులు సెట్ చేసింది RRR సినిమా. RRR సినిమా నెట్‌ఫ్లిక్స్(Netflix) ఓటీటీలో విడుదలై ఇండియాలోనే కాక విదేశాల్లో కూడా బాగా పాపులర్ అయింది.

నెట్‌ఫ్లిక్స్ లో తక్కువ రోజుల్లోనే ఎక్కువ వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమాగా కూడా రికార్డ్ సెట్ చేసింది RRR సినిమా. RRR సినిమా నెట్ ఫ్లిక్స్ లో కేవలం రెండు వారాల్లోనే 25 మిలియన్ హవర్స్ పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. RRR సినిమా తర్వాత ఏ ఇండియన్ సినిమా దీని దరిదాపుల్లోకి కూడా రాలేదు. అలియా భట్ గంగూభాయ్ కతీయవాడి సినిమా మాత్రం 22 మిలియన్ హవర్స్ వరకు వచ్చింది. అయితే తాజాగా నెట్‌ఫ్లిక్స్ లో RRR సినిమా సాధించిన ఈ రికార్డు ఓ బాలీవుడ్ చిన్న సినిమా బద్దలుకొట్టడం గమనార్హం.

Mohan Babu : మనోజ్ – విష్ణు వివాదంపై మోహన్ బాబు తాజా కామెంట్స్.. ఏమన్నాడో తెలుసా??

యామి గౌతమ్, సన్నీ కౌశల్, శరద్ కేల్కర్.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ‘చోర్‌ నికల్‌ కే భాగా’(chor nikal ke bhaga) సినిమా డైరెక్ట్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మార్చ్ 24న విడుదలైంది. హైజాక్ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. సినిమా బాగాఉండటంతో ఓటీటీ ప్రేక్షకులు ఆదరించారు. దీంతో ‘చోర్‌ నికల్‌ కే భాగా’ సినిమా కేవలం రెండు వారాల్లో 29 మిలియన్ హవర్స్ వ్యూస్ సాధించి నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పటివరకు ఉన్న RRR రికార్డుని బద్దలుకొట్టింది.

అయితే ఓ చిన్న సినిమా స్టార్ హీరోలు లేకుండా RRR సినిమా రికార్డు బద్దలుకొట్టడంతో మరింతమంది ఈ సినిమాని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.‘చోర్‌ నికల్‌ కే భాగా’ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ సాధించిన సినిమాగా మొదటి ప్లేస్ లో నిలవగా ఆ తర్వాత RRR సినిమా, గంగూభాయ్ కతీయవాడి సినిమాలు నిలిచాయి.

ట్రెండింగ్ వార్తలు