Mohan Babu : మనోజ్ – విష్ణు వివాదంపై మోహన్ బాబు తాజా కామెంట్స్.. ఏమన్నాడో తెలుసా??

తాజాగా మోహన్ బాబు బంధువులు తిరుపతిలో ఓ హాస్పిటల్ ఓపెన్ చేయగా మోహన్ బాబు ఈ కార్యక్రమానికి వచ్చారు. మోహన్ బాబుతో పాటు మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చాడు.

Mohan Babu : మనోజ్ – విష్ణు వివాదంపై మోహన్ బాబు తాజా కామెంట్స్.. ఏమన్నాడో తెలుసా??

Mohan Babu Latest comments on Vishnu Manoj Issue

Mohan Babu :  ఇటీవల కొన్ని రోజుల క్రితం మంచు మనోజ్(Manchu Manoj) తన అన్న విష్ణు(Manchu Vishnu) తనకు సంబంధించిన వారిపై దాడి చేస్తున్నాడని, ఎప్పుడు ఇలాగే తన వాళ్లపై దాడి చేస్తాడంటూ ఓ వీడియో పెట్టడంతో మనోజ్, విష్ణు మధ్య విభేదాలు బయటకు వచ్చి వార్తల్లో నిలిచాయి. కొన్ని రోజుల పాటు మనోజ్ – విష్ణు మధ్య విభేదాలు వైరల్ గా మారాయి. మనోజ్ రెండో పెళ్ళికి విష్ణు రాకపోవడం, మోహన్ బాబు యూనివర్సిటీ(MBU) వార్షికోత్సవంలో మనోజ్, విష్ణు మాట్లాడుకోకపోవడంతో వీరిద్దరి మధ్య ఏదో గొడవ అవుతుందని కూడా వార్తలు వచ్చాయి.

ఇక ఈ గొడవలపై మంచు లక్ష్మి తనకేమి తెలియదని చెప్పింది. మోహన్ బాబు ఆ వీడియో డిలీట్ చేయించి మనోజ్ పై సీరియస్ అయినట్టు కూడా తెలిసింది. తాజాగా మోహన్ బాబు బంధువులు తిరుపతిలో ఓ హాస్పిటల్ ఓపెన్ చేయగా మోహన్ బాబు ఈ కార్యక్రమానికి వచ్చారు. మోహన్ బాబుతో పాటు మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చాడు. ఈ కార్యక్రమానికి మంచు విష్ణు కూడా వచ్చాడు. కానీ ఇక్కడ కూడా విష్ణు మనోజ్ తో మాట్లాడకపోవడం గమనార్హం.

Manchu Manoj : చాలా గ్యాప్ తర్వాత.. వరుసగా మూడు సినిమాలని లైన్లో పెట్టిన మంచు మనోజ్..

హాస్పిటల్ ఓపెనింగ్ అయిన తర్వాత మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ మొదట హాస్పిటల్ గురించి మాట్లాడాడు. ఈ హాస్పిటల్ తన బంధువులదని, ఓపెనింగ్ చేయడానికి వచ్చానని తెలిపారు. ఓ మీడియా ప్రతినిధి ఇటీవల జరిగిన విష్ణు – మనోజ్ వివాదం గురించి అడగడంతో మోహన్ బాబు మాట్లాడుతూ.. నేను హాస్పిటల్ ఓపెనింగ్ కి వచ్చాను. ఇక్కడ వేరే మాట్లాడకూడదు. అయినా నీకు, నీ భార్యకు మధ్య ఏం జరుగుతుందో అందరికి చెప్తావా? అది తప్పు కదా. ఇది కూడా అంతే ఇంట్లో వాళ్ళ మధ్య అనేక సమస్యలు ఉంటాయి అని దీని గురించి అడిగిన వారి మీద సీరియస్ అయ్యాడు.