Manchu Manoj : చాలా గ్యాప్ తర్వాత.. వరుసగా మూడు సినిమాలని లైన్లో పెట్టిన మంచు మనోజ్..

ఇటీవల కొన్ని రోజుల క్రితం 'వాట్ ది ఫిష్' అనే ఓ సినిమాని ప్రకటించి త్వరలోనే వస్తున్నాను అని తెలిపాడు మనోజ్. ఆ తర్వాత భూమా మౌనికతో మనోజ్ రెండో పెళ్లి, మనోజ్ - విష్ణు వివాదం.. ఇలా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు.

Manchu Manoj : చాలా గ్యాప్ తర్వాత.. వరుసగా మూడు సినిమాలని లైన్లో పెట్టిన మంచు మనోజ్..

Manchu Manoj ready to do movies three projects in line after 6 years gap

Manchu Manoj :  మంచు వారసుడు మంచు మనోజ్ కొన్ని సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్ నుంచే కాక బయట నుంచి కూడా అభిమానులని సంపాదించుకున్నాడు. మనోజ్(manoj) చివరగా 2017లో ఒక్కడు మిగిలాడు(Okkadu Migiladu) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆ తర్వాత ఒక రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చినా అప్పట్నుంచి మంచు మనోజ్ సినిమాలకు దూరంగానే ఉన్నాడు.

ఇటీవల కొన్ని రోజుల క్రితం ‘వాట్ ది ఫిష్'(What the Fish) అనే ఓ సినిమాని ప్రకటించి త్వరలోనే వస్తున్నాను అని తెలిపాడు మనోజ్. ఆ తర్వాత భూమా మౌనికతో మనోజ్ రెండో పెళ్లి, మనోజ్ – విష్ణు వివాదం.. ఇలా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. సినిమా అనౌన్స్ చేసినా దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా మంచు మనోజ్ బంధువులు తిరుపతిలో ఓ హాస్పిటల్ ఓపెన్ చేయగా మోహన్ బాబు, తన భార్య మౌనికతో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చాడు మనోజ్.

Ravanasura : రావణాసుర ట్విట్టర్ రివ్యూ.. అభిమానులు, ప్రేక్షకులు ఏమంటున్నారు?

హాస్పిటల్ ఓపెనింగ్ అయిన తర్వాత మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే సినిమా చేస్తున్నాను, మనం మనం బరంపురం అనే సినిమా మొదలవ్వబోతుంది. ఆ తర్వాత ఇంకో సినిమా కూడా చర్చల్లో ఉంది అని చెప్పాడు. దీంతో దాదాపు 6 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాలు అనౌన్స్ చేయడంతో మనోజ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాలు ఎప్పుడు వస్తాయో చూడాలి. ఇక ఇటీవల జరిగిన విష్ణుతో వివాదం గురించి మాత్రం అడిగినా స్పందించకుండా వెళ్ళిపోయాడు మనోజ్.