Choreographer Vijay Polaki's emotional post about Chiranjeevi
Vijay Polaki: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “మన శంకర వరప్రసాద్ గారు”. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. పక్కా కమర్షియల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలో ఒక పాటను చిత్రీకరించారు మేకర్స్. ఈ పాటకి విజయ్ పొలాకి కొరియోగ్రఫీ చాశారు. దాంతో, మెగాస్టార్ కు డాన్స్ కొరియోగ్రఫీ చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు విజయ్ పొలాకి(Vijay Polaki). ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు..
Trance Of Omi: ఓజీ నుంచి ట్రాన్స్ ఆఫ్ ఓమి రిలీజ్.. ఈ బీట్ కి థియేటర్స్ తగలబడిపోవడం ఖాయం
“నా చిన్నప్పటి కల. ఎవరి డ్యాన్స్ చూసి పెరిగానో.. ఎవరి స్టెప్స్ చూసి డ్యాన్స్ మీద ఇష్టం కలిగిందో.. ఎవరి డ్యాన్స్ చూసి ఇండస్ట్రీకి వెళ్లాలనుకున్నానో.. ఎవరి డ్యాన్స్ చూసి నాకు ఆయనతో డాన్స్ చేసే ఛాన్స్ వస్తుందా? అని ఫీలయ్యానో.. అలాంటి డ్యాన్స్‌కు దేవుడైన వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి నేను కొరియోగ్రఫీ చేసే అవకాశం రావడం నాకు దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్ గా భావిస్తున్నా. 2025 అనేది నా జీవితంలో ఒక పెద్ద సంవత్సరం. మా బాస్‌తో పనిచేసే అవకాశం రావడానికి కారణం అయిన అనిల్ రావిపూడి సర్, సుస్మితగారు, సాహు గారికి ధన్యవాదాలు. ఇది జీవితంలో మర్చిపోలేని బహుమతి. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. చిరంజీవి సర్ మీరు అందించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ కట్టె కాలే వరకూ మీ ఫ్యాన్‌నే’’ అంటూ రాసుకోచ్చారు విజయ్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక విజయ్ పొలాకి విషయానికి వస్తే.. కొబ్బరిమట్ట సినిమాలోని “అఆఇఈ” అనే పాటతో కొరియోగ్రాఫర్‌గా విజయ్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తరువాత.. పలాస సినిమాలో నక్కిలిసు గొలుసు సాంగ్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలో మార్ ముంతా చోఢ్ చింతా సాంగ్, మ్యాడ్ సినిమాలో కళ్లజోడు కాలేజ్ పాప లాంటి హుషారైన పాటలకు విజయ్ కొరియోగ్రఫీ చేశారు. ఇక బ్లాక్ బస్టర్ పుష్ప సినిమాలో గణేశ్ ఆచార్య మాస్టర్‌తో ‘ఊ అంటావా’ పాటకు, పుష్ప 2లో ‘గంగమ్మ తల్లి జాతర’, ‘పుష్ప పుష్ప’ పాటలకు పెను చేశారు. ఈ పాటలను ఆయనకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.