The Odyssey Trailer: ‘ది ఒడిస్సీ’ ట్రైలర్ రిలీజ్.. నోలన్ మార్క్ విజువల్స్ నెక్స్ట్ లెవల్

విజువల్ వండర్ గా వస్తున్న క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ(The Odyssey Trailer)' మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

Christopher Nolan The Odyssey movie Trailer Released

  • నోలన్ ది ఒడిస్సీ ట్రైలర్ రిలీజ్.
  • మ్యాట్ డామన్ లీడ్ రోల్ పోషించారు.
  • జులై 17న గ్రాండ్ రిలీజ్

The Odyssey Trailer: హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ నుంచి వస్తున్న అప్ కమింగ్ మూవీ ‘ది ఒడిస్సీ’. అనౌన్స్ మెంట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఇప్పుడు సినీ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ట్రోజన్ యుద్ధం తర్వాత ఒడిస్సీ చేసిన అడ్వెంచరస్ సీ జర్నీని ఈ ట్రైలర్‌(The Odyssey Trailer)లో విజువల్ వండర్‌గా చూపించారు. భారీ సముద్ర దృశ్యాలు, పురాణ కాలం నాటి వింత జీవులు, యోధుల పోరాటాలు ప్రేక్షకులకు ఒక సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నాయి. దీనికి లుడ్విగ్ గోరాన్సన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో లెవల్‌లో ఉంది. నోలన్ తన మార్క్ నాన్-లీనియర్ స్క్రీన్ ప్లేతో ఈ స్టోరీని నెక్స్ట్ లెవల్‌లో ప్రజెంట్ చేయబోతున్నారు.

Vijay Thalapathy: కరుణానిధి వెనుక ఉన్న ఆ పిల్లాడు.. నేడు డీఎంకేకే సవాల్.. రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్

ఈ మూవీలో మ్యాట్ డామన్ లీడ్ రోల్ ప్లే చేస్తుండగా, టామ్ హాలండ్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అన్నే హాత్వే పెనెలోప్ పాత్రలో నటిస్తుండగా, జెండయా మరియు షార్లీజ్ థెరాన్ ఇతర ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. టెక్నికల్ పరంగా ఈ సినిమాను పూర్తి స్థాయిలో IMAX కెమెరాలతో షూట్ చేయడం విశేషం. నోలన్ సినిమాల్లో ఉండే ఇంట్రెస్టింగ్ ట్విస్టులు, విజువల్ గ్రాండియర్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘ది లేట్ షో’లో పాల్గొన్న నోలన్, టైమ్ అండ్ స్పేస్‌తో సంబంధం లేకుండా ఈ కథను విభిన్న కోణాల్లో తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ పురాణ గాథను నోలన్ తనదైన శైలిలో ఎలా ఆవిష్కరిస్తారోనని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతున్న ఈ భారీ చిత్రం జూలై 17, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. వెండితెరపై ఈ విజువల్ మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.