RGV-Vijay Thalapathy: కరుణానిధి వెనుక ఉన్న ఆ పిల్లాడు.. నేడు డీఎంకేకే సవాల్.. రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్
RGV Comments on Vijay Thalapathy: తమిళనాడులో విజయ్(Vijay Thalapathy) సాధించిన ఘన విజయంపై షాకింగ్ పోస్ట్ పెట్టిన రామ్ గోపాల్ వర్మ.
ram gopal varma shocking comments on dmk party and vijay thalapathy victory
- తమిళనాడు ఎలక్షన్స్‌లో విజయ్ గ్రాండ్ విక్టరీ
- వర్మ వైరల్ పోస్ట్ సెన్సేషన్ సృష్టించింది.
- విజయ్ డీఎంకేకు పెద్ద సమస్యగా మారారు.
RGV : తమిళనాడు రాజకీయాల్లో విజయ్ తలపతి తన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో అద్భుతమైన ప్రభంజనాన్ని సృష్టించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ పార్టీ సాధించిన ఘన విజయం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ, విజయ్ యువతను, సామాన్య ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో విజయవంతమయ్యారు. ఆయన సభలకు వచ్చిన అశేష జనవాహిని ఓట్లుగా మారి, అసెంబ్లీలో ఆయన పార్టీ బలమైన శక్తిగా అవతరించడం తమిళ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికింది.
ఈ అనూహ్య విజయ ప్రస్థానాన్ని విశ్లేషిస్తూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. దివంగత నేత కరుణానిధి (కలైంజర్) వెనుక విజయ్(Vijay Thalapathy) చిన్నపిల్లాడిగా నిలబడి ఉన్న పాత ఫోటోను ఆయన షేర్ చేశారు. “తన వెనుక ఉన్న ఈ పిల్లాడు ఒకరోజు తన పార్టీనే తుడిచిపెట్టే స్థాయికి ఎదుగుతాడని కలైంజర్ కలలో కూడా ఊహించి ఉండరు” అంటూ వర్మ తనదైన శైలిలో సెటైరికల్ కామెంట్స్ చేశారు. అంటే, డీఎంకే వంటి బలమైన పునాదులున్న పార్టీకి విజయ్ రూపంలో అతిపెద్ద ముప్పు పొంచి ఉందని వర్మ అభిప్రాయపడ్డారు.
వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. ఒకప్పుడు డీఎంకే అగ్రనేతల నీడలో పెరిగిన ఒక కుర్రాడు, నేడు అదే పార్టీ ఉనికిని ప్రశ్నించే స్థాయికి చేరడం రాజకీయాల్లోని విచిత్రమైన పరిణామమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. విజయ్ కేవలం సినిమా స్టార్‌గానే కాకుండా, రాజకీయ వ్యూహకర్తగా కూడా తన సత్తా చాటడంతో డీఎంకే కోటలు బద్దలవుతున్నాయని వర్మ ట్వీట్ చెప్పకనే చెబుతోంది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో తమిళనాట మరిన్ని రాజకీయ మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.
Kalaingar wouldn’t have dreamed that the kid behind him would one day destroy his party 🙏👍🔥 pic.twitter.com/7NNp6Ge73S
— Ram Gopal Varma (@RGVzoomin) May 5, 2026
