×
Ad

MAA Elections: ‘మా’ గొడవలపై రామ్ గోపాల్ వర్మ మార్క్ ట్వీట్!

'మా' ఎన్నికల వేళ సినిమా నటులు చేసిన రచ్చ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

  • Published On : October 17, 2021 / 01:08 PM IST

Ram Gopal Varma

MAA Elections: ‘మా’ ఎన్నికల వేళ సినిమా నటులు చేసిన రచ్చ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లోకల్-నాన్ లోకల్, పొలిటికల్ లీడర్స్ సపోర్ట్.. కులాల ప్రస్తావనలు, వ్యక్తిగత ఆరోపణలు, డబ్బులు పంపకం ఇలా.. ఈసారి గతంలో కంటే ఎక్కువగా విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకున్నాయి.

ఈ క్రమంలోనే ముగిసిన ఎన్నికల్లో విష్ణు అధ్యక్షుడిగా గెలవగా.. ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. ఎన్నికలు పూర్తయ్యాక కూడా ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఏదైనా కాంట్రవర్శియల్ విషయంలో నేనంటూ ముందుండే రామ్ గోపాల్ వర్మ.. లేటెస్ట్‌గా ‘మా’ అసోసియేషన్, దాని గొడవలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

‘మా’లోని మొత్తం వ్యవహారం చూస్తుంటే సర్కస్‌ని తలపించేలా ఉందంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మా సభ్యల గొడవలు సర్కస్‌లో జరిగినట్లుగా ఉన్నాయనే కోణంలో మాట్లాడారు రామ్ గోపాల్ వర్మ. సిని’మా’ వాళ్లు.. సర్కస్ వాళ్లమని నిరూపించుకున్నారు.. అంటూ ట్వీట్ వదిలారు.