CM Revanth Reddy : రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి.. భారతీయుడు-2తో మార్పు మొదలు..
భారతీయుడు 2 చిత్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
- Thota Vamshi Kumar
- Published On : July 9, 2024 / 03:03 PM IST
CM Revanth Reddy appriciates bharateeyudu 2 movie team
CM Revanth Reddy – Bharateeyudu 2 : భారతీయుడు 2 చిత్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా ప్రముఖ నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్, సిద్ధార్థ్, సముద్రఖని లు కలిసి అవగాహనా వీడియోను రూపొందించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. వీరు చేసిన వీడియోను ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ అభినందించారు.
ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రల్ క్యార్యాలయంలో నూతన వాహనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. డగ్స్ మహమ్మారి ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తుందన్నారు. ముఖ్యంగా యువత దీనికి బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Mamitha Baiju : ప్రేమలు బ్యూటీ ‘మమిత బైజు’ డ్యాన్స్ చూశారా.. వైరల్ అవుతున్న పాత వీడియో..
అదే సమయంలో డ్రగ్స్ నివారణలో భాగంగా సినిమా వాళ్లపై వ్యాఖ్యలు చేస్తూ.. సినిమా వాళ్లకు సామాజిక బాధ్యత ఉండాలన్నారు. ఇకపై సినిమా వాళ్లకు టికెట్ రేట్లు పెంచాలన్నా, సినిమాకు ఏదైనా సహాయం కావాలన్నా ఆ సినిమాలోని నటీనటులు డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ వీడియోలు తీయాలన్నారు.
ముఖ్యమంత్రి ప్రకటన తరువాత తెలుగులో విడుదల అవుతున్న తొలి సినిమా భారతీయుడు 2. జూలై 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు కానుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి మంచి పని చేస్తున్నారంటూ చెబుతూ.. డగ్ర్స్ వాడొద్దు అంటూ చిత్ర బృందం వీడియోను విడుదల చేసింది. దీంతో భారతీయుడు 2తో మార్పు మొదలైందని అంటున్నారు.
భారతీయుడు -2 సినిమా బృందానికి నా ప్రత్యేక అభినందనలు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం…
ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా…
శ్రీ కమల్ హాసన్…శ్రీ శంకర్…శ్రీ సిద్దార్థ…
శ్రీ సముద్రఖని కలిసి ఈ అవగాహనా వీడియో…
రూపొందించడం హర్షించదగ్గ విషయం.#DrugFreeTelangana #SayNoToDrugs pic.twitter.com/MDkT95sqze— Revanth Reddy (@revanth_anumula) July 9, 2024
