Mamitha Baiju : ప్రేమలు బ్యూటీ ‘మమిత బైజు’ డ్యాన్స్ చూశారా.. వైరల్ అవుతున్న పాత వీడియో..
ప్రస్తుతం మమిత బైజు ప్రేమలు 2 సినిమా చేస్తుండగా సౌత్ లో చాలా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.

Malayalam Beauty Premalu Fame Mamitha Baiju Old Dance Video goes Viral
Mamitha Baiju : మలయాళీ కుట్టి మమిత బైజు మలయాళంలో పలు సినిమాలు చేసినా ప్రేమలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమా తెలుగు, తమిళ్ లో రిలీజ్ చేయడంతో మమిత బైజు ఇక్కడ కూడా పాపులర్ అయింది. తెలుగులో కూడా ప్రేమలు సినిమా భారీ విజయం సాధించింది. ప్రేమలు సినిమాలో మమిత బైజు క్యూట్ నటనకు అంతా ఫిదా అయిపోయారు. ఇక అబ్బాయిలు అయితే ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. ప్రేమలు సినిమాతో తన సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.
ప్రస్తుతం మమిత బైజు ప్రేమలు 2 సినిమా చేస్తుండగా సౌత్ లో చాలా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. మమిత నుంచి ఏ ఫోటో వచ్చినా, తన క్యూట్ వీడియోలు వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో మమత ఓ ఈవెంట్లో చేసిన డ్యాన్స్ వీడియో బయటకి రాగా అందులో మమిత క్యూట్ డ్యాన్స్, హావభావాలు చూసి అంతా ఆశ్చర్యపోయారు. తాజాగా మమిత బైజు డ్యాన్స్ వీడియో మరొకటి వైరల్ అవుతుంది.
Also Read : Trisha – Brinda : త్రిష ఫస్ట్ వెబ్ సిరీస్ ‘బృంద’ టీజర్ రిలీజ్.. మంచితో పోరాడాలి..
గతంలో ఓ ఈవెంట్లో చీర కట్టుకొని మమిత బైజు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.ఎంత బాగా, క్యూట్ గా డ్యాన్స్ వేస్తుందో మమిత బైజు అని ఆమెని పొగిడేస్తున్నారు. మీరు కూడా మమిత బైజు డ్యాన్స్ వీడియో చూసేయండి.
Good Evening tweeps! ?❤#MamithaBaiju pic.twitter.com/0kXqIvse0H
— Mr Black (@Cult_tweets0) July 7, 2024
నెమలి కూడా ఇంత బాగా నాట్యమాడదేమో…#MamithaBaiju ?? pic.twitter.com/OxfDW2bZfr
— Movies4u Official (@Movies4u_Officl) July 8, 2024