CM Vijay: సీఎం విజయ్ విప్లవాత్మక నిర్ణయం.. తమిళనాడులో సరికొత్త సినీ రూల్స్

తమిళ ఇండస్ట్రీ గురించి సంచలన డెసిషన్ తీసుకున్న సీఎం విజయ్ తలపతి(Cm Vijay).

CM Vijay Sensational Decision Regarding the Tamil Film Industry

  • కోలీవుడ్‌కు విజయ్ బంపర్ ఆఫర్.
  • రోజుకు 5 షోలకు అనుమతి.
  • సినిమా ఇండస్ట్రీలో భారీ హర్షం.

CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్(CM Vijay) సినీ పరిశ్రమకు భారీ ఊరటనిస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో విడుదలయ్యే అన్ని తమిళ చిత్రాలకు, మొదటి వారం రోజుల పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేలా ప్రభుత్వం అధికారికంగా అనుమతినిస్తూ సరికొత్త జీవోను జారీ చేసింది. సీఎం విజయ్ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంపై కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Nayanthara: సన్ రైస్ ను ఎంజాయ్ చేస్తున్న లేడీ సూపర్ స్టార్.. భర్త, పిల్లలతో క్రేజీ ఫొటోలు

ఈ నూతన నిబంధనల ప్రకారం కోలీవుడ్ రంగానికి మరిన్ని అదనపు ప్రయోజనాలు కలగనున్నాయి. పెద్ద హీరోల చిత్రాల విడుదలైతే తెల్లవారుజామున ప్రదర్శించే స్పెషల్ షోలకు ఇకపై ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. అంతేకాకుండా, సినిమా విడుదలైన మొదటి వారం రోజులు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తమ పెట్టుబడిని త్వరగా రికవరీ చేసుకునేందుకు వీలుగా టికెట్ల ధరలను పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గతంలో పెద్ద సినిమాలకు మాత్రమే ప్రత్యేక షోలకు అనుమతి ఉండేది, దానికోసం నిర్మాతలు ప్రభుత్వాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని తమిళ సినిమాలకు మొదటి వారం పాటు రోజుకు 5 షోల వెసులుబాటు కల్పించడంతో పరిశ్రమ మొత్తానికి ఇది పెద్ద వరంలా మారింది. ఈ విప్లవాత్మక నిర్ణయంతో తమిళ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.