Krishnam Raju : అర్ధరాత్రి 3 గంటలకు స్మశానంలో.. కృష్ణంరాజు – అలీ కలిసి ఏం చేసారో తెలుసా?
తాజాగా నటుడు అలీ కృష్ణం రాజు తో జరిగిన ఓ సంఘటన తెలిపారు. (Krishnam Raju)
- Saketh U
- Published On : February 19, 2026 / 10:37 AM IST
Krishnam Raju
Krishnam Raju : కృష్ణం రాజు, ప్రభాస్.. ఆ కుటుంబం ఫుడ్ ఎంత బాగా పెడతారో అందరికి తెలిసిందే. ఇంటికి వచ్చింది ఎవరైనా ఫుడ్ తో మర్యాదలు చేసి కడుపు నింపి పంపుతారు. కృష్ణం రాజు, ప్రభాస్ ఫుడ్ పెట్టడం గురించి చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే అనేకమార్లు తెలిపారు.(Krishnam Raju)
తాజాగా నటుడు అలీ కృష్ణం రాజు తో జరిగిన ఓ సంఘటన తెలిపారు. ఇటీవల ఓ సినిమా ఈవెంట్ కి కృష్ణం రాజు భార్య శ్యామల హాజరైంది. ఇదే ఈవెంట్ కి అలీ కూడా హాజరవగా కృష్ణంరాజుతో బిల్లా సినిమా షూటింగ్ సమయంలో మలేషియాలో జరిగిన ఓ సంఘటన తెలిపారు.
Also Read : Peddi : పెద్ది నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంతో తెలుసా? చరణ్ రేంజ్ కి ఇది తక్కువే అంటున్న ఫ్యాన్స్..
అలీ మాట్లాడుతూ.. రాత్రి 3 గంటలకు చిమ్మ చీకటి. స్మశానంలో సీన్ షూటింగ్ జరుగుతుంది. కృష్ణంరాజు గారు నా దగ్గరికి వచ్చి అరె ఆలీ కీమా బిర్యాని తింటావా అని అడిగారు. అర్ధరాత్రి స్మశానంలో బిర్యానీ ఏంటండీ అంటే.. సమాధులను చూపిస్తూ వాళ్లకు అవకాశం లేదురా మనకు ఉంది అన్నారు.
అప్పుడు శ్యామల గారు బిర్యానీ తీసుకొచ్చి పెడితే మేము అర్ధరాత్రి అక్కడ స్మశానంలో బిర్యానీ తిన్నాము. ఆ టైంలో అద్భుతం. దాదాపు 40 రోజులు మలేషియాలో ఉంటే రోజుకొక ఐటెం తెచ్చిపెట్టేవాళ్ళు. ఒకసారి తెచ్చిన ఫుడ్ ఐటెం మళ్ళీ తెచ్చేవాళ్ళు కాదు అని తెలిపారు.
