Sudharshan : గోదావరిలో మునిగిపోయిన సుదర్శన్.. చనిపోయాడని ఫోన్స్ కూడా చేసేసారు.. కట్ చేస్తే..

ఓ ఇంటర్వ్యూలో సుదర్శన్ తన లైఫ్ లో జరిగిన సీరియస్ సంఘటన గురించి తెలిపాడు. (Sudharshan)

  • Published On : February 9, 2026 / 05:40 PM IST

Sudharshan

Sudharshan : షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నెల్లూరు సుదర్శన్ ఆ తర్వాత సినిమాల్లో కమెడియన్ గా మారి ఇప్పుడు ఫుల్ బిజీ అయ్యాడు. కమెడియన్ సుదర్శన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతను నటించిన హే భగవాన్ సినిమా ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది.(Sudharshan)

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇవ్వగా ఓ ఇంటర్వ్యూలో సుదర్శన్ తన లైఫ్ లో జరిగిన సీరియస్ సంఘటన గురించి తెలిపాడు.

Also Read : Funky Song : విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ ‘ఫంకీ’ కొత్త సాంగ్.. ఫుల్ వీడియో వచ్చేసింది.. స్టెప్పులు అదుర్స్..

సుదర్శన్ మాట్లాడుతూ.. కుమారి 21F సినిమా రిలీజ్ కి వారం రోజుల ముందు వేరే ఓ చిన్న సినిమా షూటింగ్ లో ఉన్నాను. గోదావరి జిల్లాల్లో షూటింగ్. షూటింగ్ సమయంలో సమయంలో గోదావరి నదిలో పడిపోయాను. నాకు ఈత రాదు దాంతో గోదావరిలో మునిగిపోయాను. అసలు నేను చనిపోయాను అని ఫోన్స్ కూడా వెళ్లిపోయాయి. అక్కడ లోకల్ మీడియా కూడా వచ్చింది.

చాలా కష్టాలు పడి బయటకు లాగారు. కడుపులోంచి నీళ్లు ఒత్తి చాలా ట్రై చేసారు. బతికి ఉన్నాను అని తెలుస్తుంది కానీ నేను కళ్ళు ఓపెన్ చేయడానికి గంటన్నర పట్టింది. అంతవరకు నేను లెగకపోవడంతో చనిపోయాను అనుకున్నారు. ఆ సంఘటనతో ఇంట్లో వాళ్ళు భయపడి తిట్టి సినిమాలేం వద్దు ఇంటికి వచ్చేయ్ ఏదన్నా బిజినెస్ చేసుకుందాం అన్నారు.

Also See : Tharun Bhascker : మొన్న ఈషారెబ్బతో.. ఇప్పుడు ఫరియా అబ్దుల్లాతో.. గాయపడ్డ సింహం తరుణ్ భాస్కర్.. ఫొటోలు వైరల్..