JetLee OTT: కమెడియన్ సత్య ‘జెట్ లీ’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కమెడియన్ సత్య ‘జెట్ లీ(JetLee OTT)’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ సిద్ధం అయ్యింది.

Comedian Satya JetLee movie ready steam on jiohotstar

  • సత్య ‘జెట్ లీ’ మూవీ.
  • మే 25న ఓటీటీ రిలీజ్.
  • జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

JetLee OTT: టాలీవుడ్ పాపులర్ కమెడియన్ సత్య పూర్తిస్థాయి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జెట్ లీ’ (JetLee). ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 1న థియేటర్లలో విడుదలైంది. వెన్నెల కిషోర్, రియా సింఘా, వైవా హర్ష, అజయ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.

Sahithi Dasari: బాబోయ్.. బీచ్ ఒడ్డున దేవకన్యలా సాహితి దాసరి.. పరువాల వలకబోస్తూ గ్లామర్ రచ్చ

థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’ (JioHotstar) దక్కించుకుంది. మే 25 నుండి ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో అధికారికంగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ఒక క్రేజీ పోస్టర్, ట్రైలర్‌తో అధికారిక ప్రకటన విడుదల చేశారు.

“విశ్వధాబి రామ… ఇంతకీ వీడు ఎవడ్రా మామ.. సత్య అసలు జెట్ లీనే కాదు.. మీ టైమ్ పాస్ కోసం ఈ ట్రైలర్ చూడండి” అంటూ ఓటీటీ సంస్థ ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్ట్ నెట్టింట నవ్వులు పూయిస్తోంది. విమానం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ క్రేజీ కామెడీ థ్రిల్లర్‌ను థియేటర్లలో మిస్ అయిన వారు మే 25 నుండి హ్యాపీగా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.