Satya : వామ్మో.. సత్య ఒక్క రోజుకు రెమ్యునరేషన్ ఎన్ని లక్షలు తీసుకుంటాడో తెలుసా?
ఇప్పుడు ఆ రేంజ్ లో కమెడియన్ సత్య రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారట. (Satya)
- Saketh U
- Published on- November 7, 2026 / 03:44 PM IST
Satya
Satya : సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్స్, పలువురు నటీనటులు సినిమాకు ఇంత అని రెమ్యునరేషన్స్ తీసుకుంటారు. కానీ కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్స్ మాత్రం రోజుకు ఇంత అని రెమ్యునరేషన్ తీసుకుంటారు. రోజుకు పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల పైన తీసుకునే ఆర్టిస్టులు కూడా ఉన్నారు. స్టార్ ఆర్టిస్టులు కొంతమంది రెండు, మూడు లక్షలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. గతంలో బ్రహ్మానందం రోజుకు మూడు నుంచి నాలుగు లక్షలు రెమ్యునరేషన్స్ తీసుకున్న రోజులు ఉన్నాయి.
ఇప్పుడు ఆ రేంజ్ లో కమెడియన్ సత్య రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారట. ఇండస్ట్రీకి ఎన్నో ఏళ్ళ క్రితమే వచ్చినా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ చిన్న చిన్న పాత్రలు వేస్తూ కమెడియన్ గా మారాడు. స్వామి రారా సినిమాతో మొదట గుర్త్తింపు వచ్చింది. అప్పట్నుంచి కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు. చలో సినిమాతో కమెడియన్ గా మరింత ఫేమ్ వచ్చింది.
Also See : Gayathri Simhadri : ఎరుపు శారీలో కార్తీక దీపం నటి.. గాయత్రి సింహాద్రి ఫోటోలు వైరల్..
ఇప్పుడు సత్య కమెడియన్ గా, కామెడీ హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు సినిమాలో కామెడీ కావాలంటే బ్రహ్మానందం ఉండాల్సిందే. ఇప్పుడు ఏ సినిమాలో అయినా సత్య ఉండాల్సిందే. అంతలా సత్య బిజీ అయ్యాడు. తన హావభావాలతో, డైలాగ్ డెలివరీతో ఫుల్ గా నవ్విస్తాడు సత్య. ఇటీవల ఆదర్శ కుటుంబం సినిమాలో కూడా సత్య పాత్రనే హైలెట్ అయింది. ఇంత బిజీగా ఉన్న సత్య రోజుకు దాదాపు రెండున్నర లక్షల వరకు తీసుకుంటున్నారట. పాత్ర పెద్దది, పెద్ద సినిమా అయితే మూడు లక్షల వరకు కూడా తీసుకుంటున్నారట. స్టార్ కమెడియన్ గా దూసుకుపోతున్న సత్య వరుస సినిమాలు చేస్తూ ఇలా భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
