కోలుకున్నకమెడియన్ సునీల్

  • Publish Date - January 24, 2020 / 01:38 AM IST

ప్రముఖ టాలివుడ్ కమెడియన్ సునీల్ ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉంది.  గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్న ఆయన లేటెస్ట్ గా  గొంతు ఇన్ఫెక్షన్ తో బాధ పడుతూ ఉండటంతో  కుటుంబసభ్యులు  గురువారం మాదాపూర్ లోని ఏషియన్ ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చేర్పించారు.

ప్రత్యేకవైద్యులు ఆయనకు చికిత్స అందించారు.  తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు స్పందిస్తూ తన ఆరోగ్య పరిస్ధితిని వివరిస్తూ సునీల్  తిరిగి తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. 

‘‘మీ ఆశీర్వాద బలంతో నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. నా ఆరోగ్యం పట్ల ఎంతగానో ఆందోళన చెందిన అందరికీ కృతజ్ఞతలు. నాపై మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు. రేపు(శుక్రవారం) విడుదల కాబోతున్న ‘డిస్కోరాజా’ చిత్రం చూసి అందరూ ఎంజాయ్ చేయండి’’ అని సునీల్ తన ట్వీట్‌లో తెలిపారు.