కరోనా ఎఫెక్ట్ : ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఇంట్లో కరోనా పరీక్షలు నిర్వహించిన ఆరోగ్య శాఖ అధికారులు..
కోలీవుడ్ స్టార్ విజయ్ ఇంట్లో ఆరోగ్య శాఖాధికారులు ఉన్నట్లుండి పరీక్షలు నిర్వహించడం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొద్దిరోజుల క్రితం విజయ్ ఇంటిపై రెండుసార్లు ఐటీ శాఖ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆరోగ్య శాఖ అధికారులు విజయ్ ఇంటికెళ్లడానికి కారణం మాత్రం కరోనా వైరస్.
ఇటీవల కాలంలో టైమ్‌లో విదేశాలకు వెళ్లి వచ్చిన వారి జాబితాను సిద్ధం చేసుకున్న తమిళనాడు ప్రభుత్వం వారి ఇళ్లకు వెళ్లి మరీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే హీరో విజయ్ ఇంటని సందర్శించి ఆయనతో పాటు వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ నిర్ధారణా పరీక్షలు నిర్వహించారు. ఎవరికీ కరోనా వైరస్ సోకలేదని సదరు ఆరోగ్యశాఖా ప్రతినిధులు నిర్ధారించారు. దీంతో విజయ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ సినిమా ఏప్రిల్ 9న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావంతో విడుదల వాయిదా పడనుందని సమాచారం. మాళవిక మోహనన్ కథానాయికగా నటించగా ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించారు.