Sridevi: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో యంగ్ బ్యూటీ.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రంలో 'కోర్ట్' ఫేమ్ శ్రీదేవి(Sridevi) కీలక పాత్ర పోషిస్తున్నారు.
- V Santhosh Kumar
- Updated on- May 19, 2026 / 07:07 PM IST
Court movie fame sridevi playing key role in rajinikanth, kamal haasan movie
- శ్రీదేవి ‘కోర్ట్’ సినిమాతో ఎంట్రీ.
- రజినీకాంత్ సినిమాలో క్రేజీ ఆఫర్.
- వైరల్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ పోస్ట్.
Sridevi: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీదేవి ‘కోర్ట్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. యంగ్ హీరో రోషన్ సరసన నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఈ జోడీ ‘బ్యాండ్ మేళం’ అనే చిత్రంలో రెండోసారి జతకట్టినప్పటికీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం తెలుగుతో పాటు కోలీవుడ్‌లో కూడా బిజీ అవుతున్న ఈ ముద్దుగుమ్మ, కేజేఆర్ సరసన నటిస్తూ తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
Meenakshi Chaudhary: పుస్తకం పట్టిన ముద్దుగుమ్మ.. మీనాక్షి చౌదరి క్యూట్ లుక్స్ వైరల్.. ఫొటోలు
ఇదిలా ఉండగా, తాజాగా ఈ బ్యూటీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ఒక భారీ చిత్రంలో శ్రీదేవి(Sridevi)కి క్రేజీ ఆఫర్ దక్కిందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. రజినీకాంత్ 1991 నాటి క్లాసిక్ హిట్ ‘తళపతి’ చిత్రంలోని ఒక ఐకానిక్ ఫోజు పక్కన, శ్రీదేవి కూడా అదే స్టైల్లో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడమే ఈ రూమర్స్‌కు ప్రధాన కారణమైంది.
ఈ వైరల్ పోస్ట్ చూసిన నెటిజన్లు, కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్ హీరోగా రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘తలైవర్-173’లో శ్రీదేవి సెలెక్ట్ అయిందని, అందుకే ఇలా హింట్ ఇచ్చిందని అనుమానిస్తున్నారు. ఈ మధ్యకాలంలో హీరోయిన్లు తాము నటించబోయే పెద్ద ప్రాజెక్ట్‌ల గురించి ముందే ఇలాంటి క్రేజీ హింట్స్ ఇచ్చి, ఆ తర్వాత అధికారిక ప్రకటనతో సర్ప్రైజ్ చేయడం ట్రెండ్‌గా మారింది. మరి శ్రీదేవి చేసిన ఈ పోస్ట్‌పై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.
