Godfather: క్రేజీ న్యూస్.. మెగాస్టార్ కోసం సల్లు భాయ్?

మెగాస్టార్ చిరంజీవి కరోనాకు ముందొక లెక్క.. కరోనా తర్వాత ఇంకోలెక్క అన్నట్లుగా వరస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.

Godfather: మెగాస్టార్ చిరంజీవి కరోనాకు ముందొక లెక్క.. కరోనా తర్వాత ఇంకోలెక్క అన్నట్లుగా వరస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఒకప్పుడు సేఫ్ గా.. కమర్షియల్ సినిమాలు మాత్రం చేసే చిరంజీవి సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేశాక కొత్త డైరెక్టర్లతో ప్రయోగాలు చేస్తున్నాడు. ఎప్పుడూ చెయ్యని కాంబినేషన్స్ ని తెరమీదకి తీసుకొస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి నాలుగు సినిమాలతో ఎనర్జిటిక్ గా దూకుడుగా చూపిస్తున్నాడు.

Bigg Boss 5 : శ్రీరామ్ బిగ్ బాస్ కప్పు గెలవాలి : సజ్జనార్

ఆల్రెడీ ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ మొన్నీ మధ్యనే బాబీ సినిమా కూడా మొదలుపెట్టేశారు. లేటెస్ట్ గా మెహర్ రమేష్ తో భోళాశంకర్ సినిమా స్టార్ట్ చేశారు. ఇలా ఒకేసారి ఇప్పుడు మూడు సినిమాలను సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. అందుకు తగ్గట్లే మెగాస్టార్ సినిమాలపై ప్రచారం కూడా అదే స్థాయిలో జరుగుతుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా పక్కా మాస్ ఎంటర్ టైనర్ కాగా.. ఇందులో తమ్ముడి పాత్ర కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ రవితేజ కానీ నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Nora Fatehi: దేవకన్యవో.. అప్సరసవో నువ్వు మనోహరి!

ఇక, మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ సినిమా లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమా కోసం మరో క్రేజీ కోసం ఇప్పుడు చర్చలు జరుగుతున్నట్లు చర్చ మొదలైంది. ఒరిజినల్ లూసిఫర్ లో పృథ్వీరాజ్ ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించాడు. ఇప్పుడు రీమేక్ లో అంతకు మించిన పవర్ ఫుల్ గా ఈ పాత్రను తీర్చిదిద్దగా ఇప్పుడు దీని కోసం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. చిరుతో సల్మాన్ సన్నిహిత సంబంధాలుండడంతో ఇది నిజం కావచ్చని మెగా అభిమానులు ఆశ పడుతున్నారు. మరి ఇది నిజమవుతుందో లేదో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు