×
Ad

Dhurandhar 2: ఇది కదా మాస్ క్రేజ్ అంటే.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న దురంధర్ 2.. విడుదలకు ముందే సరికొత్త రికార్డ్స్

దురంధర్ 2 (Dhurandhar 2)మూవీ అడ్వాన్స్ బుకింగ్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది.

Crazy response from audience to Dhurandhar 2 advance booking

  • దురంధర్ 2 ప్రీమియర్ షో బుకింగ్స్ ఓపెన్
  • ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్
  • రికార్డు లెవల్లో అమ్ముడవుతున్న టికెట్స్

Dhurandhar 2: బాలీవుడ్ మోస్ట్ హైపుడ్ మూవీ దురంధర్ 2 విడుదలకు సిద్ధం అయ్యింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలోనే తాజాగా దురంధర్: ది రివేంజ్ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. 3 నిమిషాలకు పైగా నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక రేంజ్ లో పెంచేసింది. దురంధర్ కి మించిన యాక్షన్ కంటెంట్ తో ఈ సినిమా రానుంది అన్ని క్లియర్ గా అర్థమవుతోంది. అయినప్పటికి, కంటెంట్ మాత్రం కొంచం రివీల్ కాకుండా చాలా బాగా కట్ చేశారు ట్రైలర్.

ఇక ట్రైలర్ చివర్లో ఇక పాకిస్థాన్ భవిష్యత్తు ఇప్పుడు ఇండియా చేతుల్లో అంటూ వచ్చిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దాంతో, ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది. ఇక, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ఓపెన్ చేశారు. అలాగే ఒకరోజు ముందు పైడ్ ప్రీమియర్స్ కి సంబందించిన బుకింగ్స్ ను కూడా ఓపెన్ చేశారు. దాంతో, ప్రీమియర్ షో టికెట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది.

Vijay Deverakonda: బుజ్జితల్లి ఇంటికి వచ్చేయ్.. చిన్నారి అభిమానికి విజయ్ సర్ ప్రైజ్

బుకింగ్ ఓపెన్ అయినా కొన్ని క్షణాల్లోనే ఏకంగా 90 వేలకు పైగా టికెట్స్ అబ్బురయ్యాయట. ఈ విషయాన్ని ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో అధికారికంగా ప్రకటించింది. అఫీషియల్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయితే ఈ సంఖ్యా ఇంకా ఎక్కువగా ఉంటుందని సమాచారం. దురంధర్ 2 (Dhurandhar 2)సినిమాకు విడుదలకు ముందే ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం అనేది సంచలనంగా మారింది. ఈ డిమాండ్ చూస్తుంటే, మొదటిరోజు ఈ సినిమా రికార్డ్ లెవల్లో వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఈసారి పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి బాక్సాఫీస్ మోత మోగిపోవడం ఖాయం.

ఇక దురంధర్ సినిమా విషయానికి వస్తే, కేవలం హిందీ భాషలోనే విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. మరి అంతకుమించిన హైప్ తో వస్తున్న దురంధర్ 2 మూవీ రూ.2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.