Adivi Sesh : అమ్మాయి కోసం దేశం దాటిన హీరో.. అడివి శేష్ ప్రేమకథ తెలుసా..?
తాజాగా ఓ టీవీ షోకి రాగా అక్కడ తన ప్రేమకథని పంచుకున్నాడు. (Adivi Sesh)
- Saketh U
- Published On : April 1, 2026 / 09:22 PM IST
Adivi Sesh
Adivi Sesh : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు అడివి శేష్. ఏప్రిల్ 10న డెకాయిట్ సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు అడివి శేష్. తాజాగా ఓ టీవీ షోకి రాగా అక్కడ తన ప్రేమకథని పంచుకున్నాడు.
అడివి శేష్ మాట్లాడుతూ.. నేను కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు ఒక పార్టీలో కలిసాము. అప్పుడు టీనేజర్స్. అప్పుడు దగ్గరయ్యాము. కానీ తను కెనడా అని తెలిసింది. కెనడా నుంచి పార్టీకి వచ్చింది. నేను డబ్బులు దాచుకొని తనని కలవాలని కెనడా వరకు వెళ్ళాను. కొన్ని రోజులు సాగింది. డబ్బులు పోయాయి కానీ ప్రేమ మిగలలేదు. ఇప్పుడు ప్రేమ లాంటిది లేదు. సినిమానే నా ప్రేమ, పెళ్లి అని అన్నారు.
Also See : SP Bala Subrahmanyam : కేరళలో SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ.. ఫొటోలు..
దీంతో అడివి శేష్ ప్రేమకథ వైరల్ గా మారింది. శేష్ అమెరికాలో చదువుకొని అక్కడే సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అలా అమెరికాలో చదువుకుంటున్నప్పుడే ఓ అమ్మాయితో ప్రేమలో పడి దేశం దాటి కెనడా వరకు వెళ్లి తర్వాత లవ్ ఫెయిల్యూర్ అయినట్టు తెలిపాడు.
