Dakkshi Guttikonda : బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్.. ఆర్జీవీ భామ ‘దక్షి గుత్తికొండ’ గురించి తెలుసా?
అనంతరం రెండో వైల్డ్ కార్డు ఎంట్రీగా నటి దక్షి గుత్తికొండ ఎంట్రీ ఇచ్చింది. (Dakkshi Guttikonda)
- Saketh U
- Updated on- October 11, 2026 / 09:46 PM IST
Dakkshi Guttikonda
Dakkshi Guttikonda : ఈ వారం ఎలిమినేషన్ తో పాటు అయిదుగురు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కూడా వస్తారని నిన్నే ప్రకటించారు నాగార్జున. చెప్పినట్టే నేడు మొదటి వైల్డ్ కార్డు ఎంట్రీగా సీరియల్ నటుడు శివకుమార్ ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం రెండో వైల్డ్ కార్డు ఎంట్రీగా నటి దక్షి గుత్తికొండ ఎంట్రీ ఇచ్చింది. దక్షి గుత్తికొండ మోడలింగ్ తో కెరీర్ మొదలుపెట్టింది.
Also Read : Shiva Kumar : బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కంటెస్టెంట్.. శివ కుమార్.. ఇతని గురించి తెలుసా?
దర్శకుడు ఆర్జీవీ కరోనా వైరస్ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. పలు షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లలో నటించింది. సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రతి సారి ఆర్జీవీ నటీమణుల్లో ఒకరు కచ్చితంగా బిగ్ బాస్ లో ఉంటారు. ఈసారి ఎవరూ లేరు ఏంటి అని ఇన్నాళ్లు అనుకున్నారు. ఇప్పుడు ఇలా దక్షి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. మరి ఆటతో, తన అందాలతో ఎలా అలరిస్తుందో చూడాలి.
