×
Ad

Daksha Nagarkar : కూకట్‌పల్లిలో దక్ష నగర్కార్ సందడి.. షాప్ ఓపెనింగ్‌లో..

హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో 'నైస్ నెయిల్స్ బేబీ' నూతన బ్రాంచి కార్యక్రమం ఓపెనింగ్ కి దక్ష నగర్కార్ గెస్ట్ గా వచ్చింది.

  • Published On : March 1, 2024 / 07:26 PM IST

Daksha Nagarkar Guest Appearance for a Shop Opening in Hyderabad

Daksha Nagarkar : టాలీవుడ్ భామ దక్ష నగర్కార్ పెద్ద సినిమాల్లో కీ రోల్స్ చేస్తున్నా.. తనకు బ్రేక్ వచ్చే ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా తన అందాలని ఆరబోస్తూ ఫోటోలని అప్లోడ్ చేస్తుంది. తాజాగా ఈ భామ హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో ‘నైస్ నెయిల్స్ బేబీ’ నూతన బ్రాంచి కార్యక్రమం ఓపెనింగ్ కి గెస్ట్ గా వచ్చింది.

Also Read : Hanuman : ‘హనుమాన్’ 50 రోజులు.. ఎన్ని సెంటర్స్‌లో తెలుసా? చాలా ఏళ్ళ తర్వాత టాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్..

ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ దక్ష నగర్కార్, సంజన శెట్టి అలాగే పలువురు ముఖ్య అతిధులు పాల్గొన్నారు. షాప్ ఓపెనింగ్ అనంతరం దక్ష నగర్కార్ మాట్లాడుతూ.. ‘నైస్ నెయిల్స్ బేబీ’ మొదటి బ్రాంచి గచ్చిబౌలిలో, ఇప్పుడు రెండవ బ్రాంచ్ ఇక్కడ ప్రారంభం అయింది. అందులో ఓన్లీ నెయిల్స్ కు సంభందించి ట్రీట్మెంట్ ఉంది. కూకట్ పల్లి బ్రాంచిలో మాత్రం సెలూన్, హెయిర్, మేక్ అప్.. ఇలా అన్ని అందుబాటులో ఉన్నాయని, దీనిని నేను లాంచ్ చేయడం సంతోషంగా ఉందని తెలిపింది.