Pooja Gandhi : 40 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకున్న హీరోయిన్.. లేటు వయసులో ఘాటు ప్రేమ

నటి పూజా గాంధీ పెళ్లి పీటలెక్కారు. 40 వ ఏట ఒక ఇంటివారయ్యారు. లేటు వయసులో పూజా పెళ్లాడిన వరుడెవరు?

Pooja Gandhi : 40 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకున్న హీరోయిన్.. లేటు వయసులో ఘాటు ప్రేమ

Pooja Gandhi

Pooja Gandhi : కన్నడ ‘దండుపాళ్యం’ తెలుగులో చూసిన వారు నటి పూజా గాంధీని ఈజీగా గుర్తు పెట్టేస్తారు. ఈ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించిన ఈ నటి ఇటీవలే పెళ్లి పీటలెక్కారు. 12 ఏళ్ల క్రితం  నిశ్చితార్థం రద్దు చేసుకున్న ఈ నటి 40 వ ఏట పెళ్లి చేసుకుని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు.

Alekhya Harika : మొన్నే హీరోయిన్ ఛాన్స్.. అప్పుడే కొత్త ఇల్లు కట్టేసిన బిగ్ బాస్ భామ..

నటి పూజా గాంధీ నవంబర్ 29 న పెళ్లి చేసుకున్నారు. బ్యూటీ బిజినెస్‌మెన్ విజయ్ ఘోర్పడేను పెళ్లాడారు. 40 వ ఏట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన పూజాకి 2012 లో ఆనంద్ గౌడ అనే బిజినెస్‌మెన్‌తో నిశ్చితార్థం జరిగింది. అనూహ్యంగా ఆ వివాహం రద్దైంది. 11 సంవత్సరాల గ్యాప్ తీసుకున్న పూజ లేటు వయసులో పెళ్లి చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. బెంగళూరులోని ఆరంబం హాల్‌లో ఎటువంటి ఆర్భాటం లేకుండా పూజా గాంధీ వివాహం జరిగింది. పూజా వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.

Brahmanandam : మీడియాకు బ్రహ్మానందం కామెడీ కౌంటర్.. ఓటేయడానికి వచ్చి బ్రహ్మి కామెడీ మార్క్..

పూజ గాంధీ బెంగాలీ, తమిళ భాషల్లో నటించినా కన్నడ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తెలుగులో ‘ముక్కంటి’ అనే సినిమాతో పరిచయమై ‘తగ్గేదేలే’ అనే సినిమాలో కనిపించినా ‘దండుపాళ్యం’ తెలుగు వెర్షన్ మాత్రం పూజను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది.