Brahmanandam : మీడియాకు బ్రహ్మానందం కామెడీ కౌంటర్.. ఓటేయడానికి వచ్చి బ్రహ్మి కామెడీ మార్క్..
మన కామెడీ కింగ్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా వచ్చి ఓటేశారు. బ్రహ్మానందం తన సతీమణితో కలిసి హైదరాబాద్ లో తన ఓటు ఉన్న పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటేశారు.

Brahmanandam Comedy Counter to Media Question after Voting
Brahmanandam : నేడు తెలంగాణ(Telangana Elections) వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మన టాలీవుడ్ సెలబ్రిటీలంతా కూడా హైదరాబాద్ లో ఓట్లెయడానికి క్యూ కట్టారు. ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగార్జున, విజయ్ దేవరకొండ.. లాంటి స్టార్ హీరోలతో పాటు రాజమౌళి, సుకుమార్, శేఖర్ కమ్ముల.. మరింతమంది దర్శకులు.. ఇంకా అనేకమంది సినిమా, టీవీ సెలబ్రిటీలు వచ్చి ఓటేశారు.
మన కామెడీ కింగ్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా వచ్చి ఓటేశారు. బ్రహ్మానందం తన సతీమణితో కలిసి హైదరాబాద్ లో తన ఓటు ఉన్న పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటేశారు. బ్రహ్మానందం రావడంతో పలువురు ఓటింగ్ వచ్చిన వాళ్ళు ఆయనతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. బ్రహ్మానందం ఓటేసిన అనంతరం మీడియా చుట్టుముట్టారు.
Also Read : Mokshagna : ఓటేయడానికి వచ్చిన మోక్షజ్ఞ.. ఇంత సన్నబడ్డాడేంటి? సినిమా కోసమేనా?
అయితే మీడియా ప్రతినిధుల్లో పలువురు బ్రహ్మానందంని.. సర్, కొంతమంది ఓటేయడానికి రానివాళ్లు ఉన్నారు వాళ్ళని ఏమంటారు అని అడిగారు. దీనికి బ్రహ్మి కామెడీగా.. ఏమంటారు, ఓటు వేయని వాళ్ళు అంటారు అని చెప్పారు. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వేశారు. ఓటింగ్ దగ్గరికి వచ్చి కూడా తన కామెడీని చూపించడంతో ఈ బ్రహ్మానందం వీడియో వైరల్ గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో బోలెడన్ని సరదా మీమ్స్ వస్తున్నాయి.
అట్టుంటది మరి మన భ్రమ్మితో పెట్టుకుంటే? #Telangana #TelanganaElection2023 #Elections2023 #comedy #funny #viral2023 #brahmanandam #brahmi pic.twitter.com/VbARgfMfP3
— OSLOve ❤️ (@Ikke_i_Opp) November 30, 2023
Legend ?? #brahmanandam #TelenganaElections2023 pic.twitter.com/aN5SbQO6Sw
— Narasimha (@_narasimha___) November 30, 2023