Alekhya Harika : మొన్నే హీరోయిన్ ఛాన్స్.. అప్పుడే కొత్త ఇల్లు కట్టేసిన బిగ్ బాస్ భామ..

ఇటీవలే హీరోయిన్ గా సినిమా అనౌన్స్ చేసిన అలేఖ్య ఆ సినిమా షూటింగ్ లోనే ఉండగా కొత్త ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకోవడం గమనార్హం.

Alekhya Harika : మొన్నే హీరోయిన్ ఛాన్స్.. అప్పుడే కొత్త ఇల్లు కట్టేసిన బిగ్ బాస్ భామ..

Bigg Boss Fame Alekhya Harika Construct New House and Celebrate House Warming Ceremony

Updated On : November 30, 2023 / 5:11 PM IST

Alekhya Harika : యూట్యూబ్(YouTube) లో దేత్తడి పిల్లగా తెలంగాణ స్లాంగ్ తో వీడియోలు చేస్తూ పాపులర్ అయిన అలేఖ్య హారిక ఆ తర్వాత యూట్యూబ్ లో వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో మంచి పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ లో కూడా పాల్గొని మరింత ఫేమస్ అయింది ఈ తెలంగాణ అమ్మడు. అయితే ఇప్పుడు యూట్యూబ్ నుంచి హీరోయిన్ గా కూడా ప్రమోషన్ తెచ్చుకుంది.

అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన అలేఖ్య హారిక ఇటీవలే కొన్ని రోజుల క్రితం హీరోయిన్ గా సినిమాని ప్రకటించింది. సంతోష్ శోభన్(Santosh Soban) హీరోగా సుమన్ పాతూరి అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో బేబీ(Baby) నిర్మాత SKN, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్(Sai Rajesh) కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయగా ఇందులో సంతోష్ తో అలేఖ్య డీప్ లిప్ కిస్ పెట్టుకున్న ఫోటోని పోస్ట్ చేశారు. దీంతో అలేఖ్య మొదటి సినిమాపై ముందు నుంచే అంచనాలు పెరిగిపోయాయి.

ఇటీవలే హీరోయిన్ గా సినిమా అనౌన్స్ చేసిన అలేఖ్య ఆ సినిమా షూటింగ్ లోనే ఉండగా కొత్త ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకోవడం గమనార్హం. అయితే అంతకుముందు సోషల్ మీడియా స్టార్ గా కష్టపడి సంపాదించిన డబ్బుతోనే ఈ ఇల్లు కట్టినట్టు సమాచారం. తాజాగా అలేఖ్య హారిక తన కొత్తింటి గృహ ప్రవేశం చేసుకుంది. దీనికి పలువురు సోషల్ మీడియా స్టార్స్ ని పిలిచింది. వారందరికీ పద్దతిగా తాంబూలాలు ఇచ్చి ఫొటోలు, వీడియోలు తీసుకుంది.

Bigg Boss Fame Alekhya Harika Construct New House and Celebrate House Warming Ceremony

Also Read : Vijay Devarakonda Rashmika : మళ్ళీ దొరికేసిన రష్మిక, విజయ్.. స్పెషల్ రౌడీ వేర్ ఒకే డ్రెస్‌తో విజయ్, రష్మిక..

అలేఖ్య తన కొత్తింటి ఫొటోలు, వీడియోలు షేర్ చేయకపోయినా ఈ గృహప్రవేశానికి వచ్చిన సోషల్ మీడియా స్టార్స్ అంతా పలు ఫొటోలు, వీడియోలు తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. ఇక అభిమానులు, నెటిజన్లు అలేఖ్యకు కొత్తిల్లు కట్టుకున్నందుకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

Bigg Boss Fame Alekhya Harika Construct New House and Celebrate House Warming Ceremony

 

Bigg Boss Fame Alekhya Harika Construct New House and Celebrate House Warming Ceremony