Vijay Devarakonda Rashmika : మళ్ళీ దొరికేసిన రష్మిక, విజయ్.. స్పెషల్ రౌడీ వేర్ ఒకే డ్రెస్‌తో విజయ్, రష్మిక..
రౌడీ వేర్ కి సంబంధించిన ఒకే రకమైన డ్రెస్ లు రష్మిక, విజయ్ వేసుకున్నారు. దీంతో ఇప్పుడు వీరి ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

Vijay Devarakonda Rashmika Mandanna Caught with Same Dresses of Rowdy Wear
Vijay Devarakonda Rashmika Mandanna: రష్మిక, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేస్తున్నారు అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. మధ్యలో ఓ సారి మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఆ వార్తలు కొట్టేసినా, ఇద్దరూ కలిసి ట్రిప్స్ కి వెళ్లడం, రష్మిక విజయ్ ఇంట్లో పండగలు సెలబ్రేట్ చేసుకోవడం, విజయ్ ఇంట్లో రష్మిక ఫొటోలు దిగి పోస్ట్ చేయడంతో వీళ్ళ రిలేషన్ మీద రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఇటీవల అన్‌స్టాపబుల్ షోలో బాలయ్య కూడా అడగడం, విజయ్ కి కాల్ చేయడం, రణబీర్.. విజయ్ రష్మిక గురించి చెప్పడంతో మరోసారి ఈ జంట వైరల్ గా మారింది. వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారనే వార్తలు ఎక్కువయ్యాయి. వీటికి తోడు తాజాగా ఈ జంట వేసిన డ్రెస్ తో మరోసారి వైరల్ అవుతున్నారు.
విజయ్ రౌడీ వేర్ అనే బ్రాండ్ తో క్లాత్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. రౌడీ వేర్ నుంచి ఇప్పటికే పలు రకాల కొత్త కొత్త డ్రెస్ లు మార్కెట్ లోకి వచ్చాయి. ఇటీవలే రౌడీ వేర్ ప్రొడక్షన్ ఆపేసి త్వరలో మరింత కొత్తగా డ్రెస్ లు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు విజయ్ దేవరకొండ. డిసెంబర్ నుంచి రౌడీ వేర్ కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ అవ్వనున్నాయి. అయితే ఈ ప్రోడక్ట్స్ లాంచ్ అయ్యేముందే రౌడీ వేర్ కి సంబంధించిన ఒకే రకమైన డ్రెస్ లు రష్మిక, విజయ్ వేసుకున్నారు. దీంతో ఇప్పుడు వీరి ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
రష్మిక ఎయిర్ పోర్ట్ లో వెళ్తూ కనపడిన ఓ వీడియోలో రౌడీ వేర్(Rowdy Wear) కి సంబంధించిన హుడీ వేసుకుంది. ఇది చూసి అక్కడున్న వాళ్ళు రౌడీ వేర్, విజయ్ దేవరకొండ అని అరవడంతో రష్మిక నవ్వుతూ వెళ్ళిపోయింది. ఇక విజయ్ దేవరకొండ నేడు ఓటు వేయడానికి రాగా రౌడీ వేర్ హుడీ రష్మిక వేసుకున్న లాంటిదే వేసుకొని వచ్చాడు. దీంతో ప్రోడక్ట్ లాంచ్ చేసేముందు ఇద్దరూ కలిసి రౌడీ వేర్ ని ప్రమోట్ చేస్తున్నారా? ఇద్దరూ ఒకటే డ్రెస్ వేసుకోవడం, ఒకే రోజు .. అని సందేహాలు వ్యక్తం చేస్తూ వీరిద్దరి మధ్య ఏముంది అని మరోసారి నెటిజన్లు, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మాట్లాడేసుకుంటున్నారు.
Also Read : Vijay – Rashmika : అన్‌స్టాపబుల్ షోలో విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమ కథకి క్లారిటీ వచ్చిందా..?
నిన్న జరిగిన హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రష్మిక, విజయ్ ఫోటో చూపించడం చర్చగా మారింది. అసలు ఆ ఈవెంట్ కి, వాళ్లకి సంబంధం లేకపోయినా అంత పబ్లిక్ ఈవెంట్ లో వీరి ఫొటోలు చూపించడంతో వీళ్ళ రిలేషన్ నిజమేనా అని గుసగుసలు వినపడుతున్నాయి. మరి విజయ్, రష్మిక వీటిపై స్పందిస్తారో లేదో చూడాలి.
Rumoured lovebirds #RashmikaMandanna & #VijayDeverakonda spotted wearing the same hoodies from Vijay’s brands! ?#AnimalTheFilm #AnimalOn1stDec pic.twitter.com/ro3me5dJ7A
— Bollywood Talkies (@bolly_talkies) November 30, 2023
Both #VijayDeverakonda and #RashmikaMandana wear the same shirt today
Rwdy wear #RashmikaMandanna pic.twitter.com/gtcVX8XCu5
— STAR KOLLYWOOD (@STAR_KollyWood) November 30, 2023
Rash in New Rowdy wear?♥️
Dec lo launch ayye stock I think#VijayDeverakonda #RashmikaMandannapic.twitter.com/ERqPeGLPEt
— ??????? (@Tarun_VDF) November 30, 2023
Voted Yet ??#VijayDeverakonda #TelanganaAssemblyElections pic.twitter.com/vq6LefeZyo
— KARTHIK REDDY (@thekarthikreddy) November 30, 2023