James Bond : త్వరలో కొత్త జేమ్స్ బాండ్.. డేనియల్ క్రేగ్ తప్పుకున్నట్టే.. ఎవరా కొత్త హీరో?
చివరిసారిగా 2021లో 'నో టైం టు డై' సినిమా రాగా అందులో డేనియల్ క్రేగ్ బాండ్ గా మెప్పించాడు.
- Saketh U
- Published On : March 21, 2024 / 09:06 AM IST
Daniel Craig Replaced with New James Bond Aaron Taylor Johnson in Upcoming Bond Movie Rumors goes Viral
James Bond : హాలీవుడ్ జేమ్స్ బాండ్ సినిమాలంటే ప్రపంచమంతా ఆసక్తి. థ్రిల్లింగ్ సబ్జెక్టుతో, అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో జేమ్స్ బాండ్ సినిమాలు ప్రపంచ ప్రేక్షకులని మెప్పించాయి. జేమ్స్ బాండ్ క్యారెక్టర్ ని ఆధారంగా తీసుకొని అన్ని సినీ పరిశ్రమలలో చాలా సినిమాలు వచ్చాయి. ఆ క్యారెక్టర్ అంత బాగా హిట్ అయింది. జేమ్స్ బాండ్ సిరీస్ లో ఇప్పటి వరకు 25 సినిమాలు వచ్చాయి. ఆరుగురు జేమ్స్ బాండ్ క్యారెక్టర్ లో నటించారు.
చివరిసారిగా 2021లో ‘నో టైం టు డై’ సినిమా రాగా అందులో డేనియల్ క్రేగ్ బాండ్ గా మెప్పించాడు. డేనియల్ మొత్తం అయిదు జేమ్స్ బాండ్ సినిమాల్లో నటించాడు. త్వరలో 26వ జేమ్స్ బ్యాండ్ సినిమా మొదలవ్వబోతుంది. కానీ ఈసారి డేనియల్ క్రేగ్ జేమ్స్ బాండ్ క్యారెక్టర్ చేయడానికి ఆసక్తి చూపించట్లేదట. దీంతో నిర్మాణ సంస్థ కొత్త జేమ్స్ బాండ్ కోసం వెతుకుంది. ఈ క్రమంలో హాలీవుడ్ హీరో ఆరోన్ టేలర్ జాన్సన్ పేరు వినిపిస్తుంది.
Also Read : Prithviraj Sukumaran : మూడు రోజులు అన్నం తినకుండా.. 31 కేజీల బరువు తగ్గి.. సినిమా కోసం స్టార్ హీరో కష్టం..
2000 సంవత్సరం నుంచి ఆరోన్ టేలర్ జాన్సన్ హాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నాడు. కిక్ యాస్, ఎవెంజర్స్, గాడ్జిల్లా, టెనెట్, బులెట్ ట్రైన్.. లాంటి పలు సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆరోన్ టేలర్ జాన్సన్‌ని జేమ్స్ బాండ్ హీరో చేయాలని నిర్మాణ సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఆరోన్ టేలర్ జాన్సన్ కూడా పలు సినిమాల్లో యాక్షన్స్ సీన్స్ తో మెప్పించాడు. మరి నెక్స్ట్ జేమ్స్ బాండ్ గా ఎవరు కనిపిస్తారో చూడాలి.
