Prithviraj Sukumaran : మూడు రోజులు అన్నం తినకుండా.. 31 కేజీల బరువు తగ్గి.. సినిమా కోసం స్టార్ హీరో కష్టం..

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ చేసిన ‘ఆడు జీవితం: ది గోట్‌ లైఫ్‌’ అనే సినిమా మార్చి 28న రాబోతుంది.

Prithviraj Sukumaran : మూడు రోజులు అన్నం తినకుండా.. 31 కేజీల బరువు తగ్గి.. సినిమా కోసం స్టార్ హీరో కష్టం..

Prithviraj Sukumaran Aadu Jeevitham The Goat Life Character Transformation

Updated On : March 21, 2024 / 8:44 AM IST

Prithviraj Sukumaran : మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. ప్రస్తుతం వరుస సినిమాల హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. సినిమా కోసం, అందులోని తన పాత్రకు తగ్గట్టు మారడం కోసం ఎంతైనా కష్టపడతాడు పృథ్వీరాజ్‌. ఓ పక్క మలయాళంలో హీరోగా చేస్తూనే వేరే భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే సలార్ సినిమాలో కూడా ప్రభాస్ ఫ్రెండ్ గా మెప్పించాడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ చేసిన ‘ఆడు జీవితం: ది గోట్‌ లైఫ్‌’(The Goat Life) అనే సినిమా మార్చి 28న రాబోతుంది. ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా దాదాపు పదేళ్ల క్రితం మొదలవ్వగా ఆరేళ్లుగా షూటింగ్ జరుపుకుంది. కేరళ నుంచి ఓ దేశానికి పనికి వెళ్లిన యువకుడు అక్కడ బానిసగా మారితే తప్పించుకొని ఓ ఎడారిలో దారి తప్పిపోతే ఏమైంది అనే కథాంశంతో ఈ ఆడు జీవితం: ది గోట్‌ లైఫ్‌ తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ చాలా కష్టపడ్డాడు. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

Also Read : BuchiBabu Sana : RC16 డైరెక్టర్ బుచ్చిబాబు సాన.. ఎంతైనా తోపు అబ్బా..

ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మాట్లాడుతూ.. ఎడారిలో దారి తప్పిపోయిన వ్యక్తిగా కనపడాలని, ఫేస్ లో అలాంటి ఎక్స్‌ప్రెషన్స్ రావాలని నేను కూడా మూడు రోజుల పాటు ఫుడ్ మానేసేవాడిని. మళ్ళీ తర్వాత కొంచెం తిని షూటింగ్ మధ్యలో మరో మూడు రోజులు ఫుడ్ మానేసేవాడిని. కేవలం, నీళ్లు, బ్లాక్ కాఫీ తాగేవాడిని. మానసికంగా కూడా ఈ పాత్ర కోసం చాలా మారాను. ఈ సినిమా కోసం ఏకంగా 31 కిలోలు బరువు తగ్గాను. నాకు ఈ పాత్ర చాలా ఛాలెంజ్ ఇచ్చింది అని తెలిపారు. దీంతో మరోసారి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సినిమా కోసం ఎంత కష్టపడతాడో తెలుస్తుంది.