×
Ad

Dasara Collections : నాని కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్.. అదరగొట్టిన దసరా కలెక్షన్స్..

పాన్ ఇండియా రిలీజ్, సినిమా మొదటి ఆటకి, అమెరికా ప్రీమియర్స్ కి సూపర్ హిట్ టాక్ రావడంతో పాటు నాని థియేటర్స్ లో తన యాక్టింగ్ తో విధ్వసం సృష్టించాడని టాక్ రావడంతో జనాలు థియేటర్స్ కి క్యూ కట్టారు. దీంతో మొదటి రోజు కలెక్షన్స్...................

  • Published On : March 31, 2023 / 11:52 AM IST

Dasara Movie Collections Nani Career Highest Openings

Dasara Collections :  నాని(Nani) హీరోగా, కీర్తి సురేష్(Keerthy Suresh) హీరోయిన్ గా, దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) ముఖ్య పాత్రలో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దసరా. నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపిస్తుండటం, ముందే సినిమా సాంగ్స్, ట్రైలర్స్ ప్రేక్షకులని మెప్పించడంతో సినిమాపై భారీ అంచనాలు ఉండగా నాని ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తూ, భారీగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై మరింత హైప్ పెంచేశాడు. శ్రీరామనవమి(Sri Ramanavami) కానుకగా మార్చ్ 30న దసరా(Dasara) సినిమా రిలీజ్ అయింది.

మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ సినిమాగా నిలిచింది దసరా. దసరా సినిమాకి ముందు నుంచే హైప్ ఉండటం, పాన్ ఇండియా రిలీజ్ కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ లోనే కలెక్షన్స్ అదరగొట్టేసింది. పాన్ ఇండియా రిలీజ్, సినిమా మొదటి ఆటకి, అమెరికా ప్రీమియర్స్ కి సూపర్ హిట్ టాక్ రావడంతో పాటు నాని థియేటర్స్ లో తన యాక్టింగ్ తో విధ్వసం సృష్టించాడని టాక్ రావడంతో జనాలు థియేటర్స్ కి క్యూ కట్టారు. దీంతో మొదటి రోజు కలెక్షన్స్ అదిరిపోయాయి.

Ponniyin Selvan 2 Trailer Launch : పొన్నియిన్ సెల్వన్ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..

దసరా సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఏకంగా 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి నాని కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. దీంతో చిత్రయూనిట్ తో పాటు, నాని అభిమానులు కూడా ఫుల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీకెండ్ ఉండటంతో ఈ మూడు రోజులు కూడా ఫుల్ గా దసరా సినిమాకు కలెక్షన్స్ వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు చిత్రయూనిట్. అటు అమెరికాలో కూడా నానికి కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ రావడం విశేషం. అమెరికాలో మొదటి రోజు 850K డాలర్స్ కి పైగా కలెక్ట్ చేసి 1 మిలియన్ డాలర్స్ కి దూసుకెళ్తుంది. మొత్తానికి ఊర మాస్ యాక్టింగ్, సినిమాతో నాని కెరీర్ లో బెస్ట్ సినిమా ఇవ్వడమే కాకుండా బెస్ట్ కలెక్షన్స్ కూడా రాబడుతున్నాడు.