Debjani Modak : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన మొదటి కంటెస్టెంట్.. ‘దేబ్జానీ మోదక్’ గురించి తెలుసా..

మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ వచ్చింది. (Debjani Modak)

  • Published on- September 6, 2026 / 07:26 PM IST

Debjani Modak

Debjani Modak : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నేటి నుంచే గ్రాండ్ గా ఆరంభమయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ వచ్చింది. బెంగాలీ మోడల్, నటి బెంగాలీలో పలు సీరియల్స్ చేసింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో దేబ్జానీ మోదక్ సత్యభామ, ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్స్ తో ప్రేక్షకులను మెప్పించింది. మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి దేబ్జానీ మోదక్ మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇచ్చి తెలుగులో మాట్లాడింది. నాగార్జున సాంగ్ కూడా పాడింది.

Also Read : Mokshagna Nandamuri : ‘విశ్వంభర’ రిలీజ్ చెయ్యకుండా.. బాలయ్య కొడుకుతో సినిమా అనౌన్స్ చేసిన దర్శకుడు..