Deepika Padukone: హ్యాట్సాఫ్ దీపికా.. గర్భవతిగా ఉంటూనే ‘రాకా’ షూటింగ్‌.. యాక్షన్ సీక్వెన్స్ కూడా

ప్రెగ్నెంట్ అయినప్పటికీ నిర్మాతలకు భారం కాకుండానే షూటింగ్ లో పాల్గొంటున్న దీపికా పదుకొనె(Deepika Padukone).

Deepika Padukone participates in the shooting of Raka while pregnant.

  • సినిమా పట్ల దీపికా డెడికేషన్ నెక్స్ట్ లెవల్
  • ప్రెగ్నెట్ గా ఉన్నా కూడా షూటింగ్ లో దీపికా
  • వైద్యుల పర్యవేక్షణలో యాక్షన్ సీన్స్ కూడా

Deepika Padukone: స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే తన వృత్తి పట్ల చూపిస్తున్న నిబద్ధత ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికీ, తన వల్ల ఏ సినిమా షూటింగ్ ఆగకూడదనే పట్టుదలతో ఆమె పెద్ద సాహసమే చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘రాకా’ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దీపికాకి కూడా భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. వాటిని, ఆమె గర్భంతో ఉండి కూడా పూర్తి చేస్తున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

Sugriva Trailer: ఆకట్టుకుంటున్న ‘సుగ్రీవ’ ట్రైలర్.. ఏప్రిల్ 24న థియేటర్లలోకి వస్తున్న మూవీ

అయితే, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణలో దీపికా(Deepika Padukone) ఆరోగ్యం, భద్రతకు సంబంధించి చిత్ర యూనిట్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారట. నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చిత్రీకరణ సాగుతోందట. కేవలం ‘రాకా’ మాత్రమే కాకుండా, షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ చిత్రంలో కూడా దీపికా నటిస్తున్న విషయం తెలిసిందే. వాటిని కూడా ఆమె ప్రెగ్నెంట్ గా ఉంటూనే పూర్తి చేయాల్సి ఉంది. రెండు పెద్ద ప్రాజెక్టులు కావడంతో షూటింగ్ షెడ్యూల్స్‌కు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆమె తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు.

దీపికా తన గర్భధారణ కాలం మొత్తాన్ని సినిమాల కోసమే కేటాయించాలని నిశ్చయించుకోవడం విశేషం. నిర్మాతలకు ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ఆమె కష్టతరమైన యాక్షన్ సన్నివేశాల్లో సైతం పాల్గొంటున్నారు. ఒకవైపు తల్లి కాబోతున్న ఆనందాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు వృత్తిపరంగా ఇంతటి సాహసం చేయడం పట్ల సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.