Deepika Padukone – Ranveer Singh : పేరెంట్స్ కాబోతున్న దీపికా పదుకోన్ రణవీర్ సింగ్ దంపతులు.. అధికారికంగా ప్రకటన..

రణవీర్ సింగ్ - దీపికా పదుకోన్ జంట తాము తల్లితండ్రులు కాబోతున్నట్టు ప్రకటించారు.

Deepika Padukone - Ranveer Singh have announced that they are going to be parents soon

Deepika Padukone – Ranveer Singh : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ – దీపికా పదుకోన్ లు 2018లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ జంట తాము తల్లితండ్రులు కాబోతున్నట్టు అధికారికంగా తమ సోషల్ మీడియాలో తెలిపారు.

ప్రస్తుతం దీపికా పదుకోన్ ప్రగ్నెంట్ అని, సెప్టెంబర్ లో బిడ్డకు జన్మనివ్వనున్నట్టు తెలిపారు. దీంతో బాలీవుడ్ స్టార్స్, అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : Prabhas Spirit : ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా గురించి మాట్లాడిన సందీప్ వంగ.. స్టోరీ లైన్ అదిరిందిగా..

కొన్ని సంవత్సరాలు ప్రేమించుకొని దీపికా రణవీర్ లు 2018 నవంబర్ 14న హిందూ సాంప్రదాయంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ స్టార్ కపుల్స్ లో ఒకరిగా ఈ జంట అందర్నీ ఆకర్షించింది. ఈ ఇద్దరూ ఎక్కడ కనపడినా కచ్చితంగా వైరల్ అయ్యేవారు. ఇప్పుడు వీరు తల్లి తండ్రులు కాబోతున్నాం అని ప్రకటించడంతో ట్రెండ్ అవుతున్నారు ఈ జంట. త్వరలో దీపికా కల్కి 2898AD సినిమాతో టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇద్దరూ ప్రస్తుతం సినిమాలతో బిజీగానే ఉన్నారు. ఈ ప్రగ్నెన్సీ ప్రకటనతో దీపికా కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇవ్వొచ్చు అని తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు