Prabhas Spirit : ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా గురించి మాట్లాడిన సందీప్ వంగ.. స్టోరీ లైన్ అదిరిందిగా..

యానిమల్ సినిమాతో భారీ హిట్ కొట్టిన సందీప్ వంగ నెక్స్ట్ తీయబోయేది స్పిరిట్ సినిమా అని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ఇటీవల తెలిపారు. తాజాగా మరోసారి సందీప్ వంగ స్పిరిట్ సినిమా గురించి మాట్లాడారు.

Prabhas Spirit : ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా గురించి మాట్లాడిన సందీప్ వంగ.. స్టోరీ లైన్ అదిరిందిగా..

Director Sandeep Reddy Vanga Speak about Prabhas Spirit Movie

Updated On : February 29, 2024 / 9:48 AM IST

Prabhas Spirit : ప్రభాస్ సలార్ సినిమా సక్సెస్ తర్వాత భారీ లైనప్ ఉంది. త్వరలో మే 9న కల్కి సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత రాజా సాబ్ సినిమాతో రాబోతున్నాడు. అనంతరం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. స్పిరిట్ సినిమాని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ – సందీప్ వంగ సంయుక్త నిర్మాణంలోతెరకెక్కనుంది.

ఇటీవల యానిమల్ సినిమాతో భారీ హిట్ కొట్టిన సందీప్ వంగ(Sandeep Reddy Vanga) నెక్స్ట్ తీయబోయేది స్పిరిట్ సినిమా అని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ఇటీవల తెలిపారు. తాజాగా మరోసారి సందీప్ వంగ స్పిరిట్ సినిమా గురించి మాట్లాడారు.

Also Read : Chaari 111 : వెన్నెల కిషోర్ హీరోగా చేసిన ‘చారి 111’ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. పొగిడేసిన మ్యూజిక్ డైరెక్టర్..

బాలీవుడ్ లో దుకాణ్ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లిన సందీప్ వంగని అక్కడి మీడియా ప్రతినిధులు నెక్స్ట్ సినిమా గురించి చెప్పుమనగా.. ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయబోతున్నాను. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇది ఒక సిన్సియర్ పోలీసాఫీసర్ కథ, ఇందులో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ గా కనిపిస్తారు అని తెలిపారు. దీంతో సందీప్ వంగ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రభాస్ సిన్సియర్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పట్నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.