Chaari 111 : వెన్నెల కిషోర్ హీరోగా చేసిన ‘చారి 111’ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. పొగిడేసిన మ్యూజిక్ డైరెక్టర్..
ఇన్నాళ్లు కమెడియన్ గా మెప్పించిన వెన్నెల కిషోర్ చారి 111 సినిమాతో నవ్విస్తూనే యాక్షన్ చేస్తూ హీరోగా అదరగొట్టాడని తెలుస్తుంది.

Vennela Kishore Chaari 111 Movie First Review by Music Director Simon K King
Chaari 111 Movie : కమెడియన్ వెన్నెల కిషోర్(Vennela Kishore) చారి 111 అనే సినిమాతో హీరోగా రాబోతున్నాడు. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుండగా సత్య, మురళి శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీర్తి కుమార్ దర్శకత్వంలో బర్కత్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 1న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. స్పై కామెడీ జానర్ లో ఈ సినిమా రాబోతుంది.
ఇప్పటికే చారి 111 సినిమా టీజర్, ట్రైలర్స్ తో ప్రేక్షకులని మెప్పించాయి. దేశానికి ఓ ఆపద వస్తే ఒక సీరియస్ ఇష్యూని సీక్రెట్ ఏజెంట్ చారి కామెడీగా ఎలా డీల్ చేసాడు అనే కథాంశంగా ఈ సినిమా ఉండబోతుంది అని సమాచారం. రేపు థియేటర్స్ లో రిలీజయ్యే ముందే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ సైమన్ కింగ్ చారి 111 ఫస్ట్ రివ్యూ ఇచ్చేసాడు.
Also Read : Muhammad Ali : వరల్డ్ గ్రేటెస్ట్ బాక్సర్ బయోపిక్ తీస్తా అంటున్న రానా.. రానానే హీరోగా?
సైమన్ కింగ్ నిన్న రాత్రే చారి 111 ఫైనల్ వర్షన్ సినిమా చూసేసి తన ట్విట్టర్ లో సినిమా గురించి పోస్ట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ సైమన్ కింగ్ తన ట్విట్టర్ లో.. చారి 111 సినిమా థియేటర్స్ లో ఫైర్ అవ్వడానికి రెడీగా ఉంది. ఈ సినిమాకి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది. పక్కా అందర్నీ ఎంటర్టైన్మెంట్ చేసే సినిమా. వెన్నెల కిషోర్ ఫ్యాన్స్ మాత్రం గర్వంగా ఫీల్ అవుతారు అని ట్వీట్ చేశారు.
#Chaari111 – locked , loaded and ready to fireeee ! Had a blast scoring music for this one !! A sureshot entertainer on its way !!! #Vennelakishore fans Podra BGM uh !! ?????????
— Simon K.King (@simonkking) February 28, 2024
దీంతో ఇన్నాళ్లు కమెడియన్ గా మెప్పించిన వెన్నెల కిషోర్ చారి 111 సినిమాతో నవ్విస్తూనే యాక్షన్ చేస్తూ హీరోగా అదరగొట్టాడని తెలుస్తుంది. అందులోనూ మన దగ్గర స్పై కామెడీ సినిమాలు చాలా తక్కువ కాబట్టి కచ్చితంగా ప్రేక్షకులు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు.