Muhammad Ali : వరల్డ్ గ్రేటెస్ట్ బాక్సర్ బయోపిక్ తీస్తా అంటున్న రానా.. రానానే హీరోగా?

బయోపిక్స్ గురించి అడగ్గా రానా సమాధానమిస్తూ..

Muhammad Ali : వరల్డ్ గ్రేటెస్ట్ బాక్సర్ బయోపిక్ తీస్తా అంటున్న రానా.. రానానే హీరోగా?

Rana Daggubati Wants to make The Greatest Boxer Muhammad Ali Biopic

Updated On : February 29, 2024 / 8:55 AM IST

Muhammad Ali : ఇటీవల అన్ని సినీ పరిశ్రమలలోను బయోపిక్స్ వస్తున్నాయి. పలు రంగాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగిన గొప్ప గొప్ప వాళ్ళ కథలని తీసుకొని బయోపిక్స్(Biopic) గా మారుస్తున్నారు. ఇందులో కొన్ని ఫెయిల్ అయినా చాలా వరకు విజయాలే సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దగ్గుబాటి రానా కూడా ఓ బయోపిక్ తీయాలని ఉందని తెలిపాడు.

ఇటీవల రానా(Rana Daggubati) ఓ ఈవెంట్లో పాల్గొనగా అక్కడకి వచ్చిన మీడియా ప్రతినిధులు రానాని ఇంటర్వ్యూ చేసారు. ఈ నేపథ్యంలో బయోపిక్స్ గురించి అడగ్గా రానా సమాధానమిస్తూ.. నేను స్పోర్ట్స్ బేస్డ్ బయోపిక్ తీస్తాను. గ్రేట్ బాక్సర్ ముహమ్మద్ అలీ బయోపిక్ తీయాలనుకుంటున్నాను అని తెలిపాడు.

అమెరికాకు చెందిన ముహమ్మద్ అలీ గ్రేటెస్ట్ బాక్సర్స్ లో ఒకరు. ఎన్నో వరల్డ్ రికార్డులు సృష్టించాడు. 6 అడుగుల 3 అంగుళాల హైట్, హెవీ వెయిట్ తో రింగ్ లో ప్రత్యర్థులను భయపెట్టేవాడు. ఒలంపిక్స్ లో కూడా ఎన్నో మెడల్స్ సాధించాడు. ముహమ్మద్ అలీకి అమెరికాలోనే కాక ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు. 2016లో అలీ మరణించారు.

Also Read : Operation Valentine : జస్ట్ ఇంత తక్కువ బడ్జెట్‌లో ఆ రేంజ్ విజువల్స్ తో సినిమానా?.. అద్భుతం చేస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’..

ఈ గ్రేట్ బాక్సర్ పై హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇండియాలో ఇంకా రాలేదు. మరి రానా తీసే ముహమ్మద్ అలీ బయోపిక్ ఎలా ఉంటుందో చూడాలి. అలీగా రానానే కనిపిస్తాడా? లేక నిర్మాతగా మాత్రమే ఉంటాడా కూడా తెలియాల్సి ఉంది. రానా హైట్, బాడీ చూస్తే అలీ పాత్రకి రానా కరెక్ట్ గానే సెట్ అవుతాడు. మరి ఈ వరల్డ్ గ్రేటెస్ట్ బాక్సర్ బయోపిక్ రానా ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి.