Operation Valentine : జస్ట్ ఇంత తక్కువ బడ్జెట్‌లో ఆ రేంజ్ విజువల్స్ తో సినిమానా?.. అద్భుతం చేస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’..
ఆపరేషన్ వాలెంటైన్ విజువల్స్ చూస్తుంటే దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ పెట్టరేమో అనిపిస్తుంది. ఈ సినిమా బడ్జెట్ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు.

Varun Tej gives Clarity on Operation Valentine Movie Budget Best Quality Output in Limited Budget
Operation Valentine : మెగా హీరో వరుణ్ తేజ్(Varin Teja) హీరోగా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘ఆపరేషన్ వాలంటైన్’(Operation Valentine). ఈ సినిమాని రెనైసెన్స్ పిక్చర్స్ సోని పిక్చర్స్ తో కలిపి నిర్మించింది. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో వరుణ్ తేజ్ భారత వైమానిక దళ అధికారి పాత్రలో నటిస్తుండగా.. హీరోయిన్ మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా, రుహానీ శర్మ, నవదీప్, శతాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పుల్వామా అటాక్, దానికి భారతదేశం ఉగ్రవాదులకు ఇచ్చిన కౌంటర్ అటాక్.. వంటి రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు.
ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషలలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా విజువల్స్ చూస్తుంటే దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ పెట్టరేమో అనిపిస్తుంది. విజువల్స్, క్వాలిటీ, VFX ఆ రేంజ్ లో ఉన్నాయి. కానీ నిర్మాతలు, వరుణ్ తేజ్ ఈ సినిమా బడ్జెట్ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు.
ఆపరేషన్ వాలెంటైన్ సినిమాకు కేవలం 42 కోట్లు మాత్రమే ఖర్చయింది అని, ఇంకో 8 కోట్లు ప్రమోషన్స్ కి పెట్టాము అని మొత్తం 50 కోట్లలో సినిమాని పూర్తిచేసాము అని తెలిపారు. ఇందులోనే సీజీ వర్క్ కి కేవలం 5 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టాం అని కూడా తెలిపారు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చిరంజీవి ఈ సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుతూ.. ఈ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. భారీ బడ్జెట్ సినిమా అనుకున్నాను. కానీ చాలా తక్కువ బడ్జెట్ లో అది కూడా 75 రోజులోనే ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు అంటే గ్రేట్ అంటూ చిత్రయూనిట్ ని అభినందించారు.
Also Read : Venkatesh : వెంకటేష్ సినిమా నెక్ట్ టైటిల్ అదిరిందిగా.. మళ్ళీ సంక్రాంతి టార్గెట్..
ఇటీవల వచ్చిన హృతిక్ రోషన్ ఫైటర్ సినిమా కూడా ఇలాంటి ఎయిర్ ఫోర్స్ ఆధారిత సినిమానే కానీ దానికి 100 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు. వరుణ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మాత్రం కేవలం 42 కోట్లలో పూర్తిచేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం అయిపోయింది.వరుణ్ కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొడతాడని భావిస్తున్నారు.