Deepthi Sunaina : దీప్తి సునయనకు ప్రమాదం..! అసలు నిజం ఇదే..
దీప్తి సునయన (Deepthi Sunaina).. పరిచయం చేయాల్సిన పని లేదు. షార్ట్ ఫిల్మ్స్‌తో ఆకట్టుకున్న అమ్మడు బిగ్‌బాస్ (Bigg Boss) తెలుగు రియాలిటీ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.
- Thota Vamshi Kumar
- Published On : September 9, 2023 / 08:13 PM IST
Deepthi Sunaina
Deepthi Sunaina : దీప్తి సునయన (Deepthi Sunaina).. పరిచయం చేయాల్సిన పని లేదు. షార్ట్ ఫిల్మ్స్‌తో ఆకట్టుకున్న అమ్మడు బిగ్‌బాస్ (Bigg Boss) తెలుగు రియాలిటీ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. గత కొద్ది రోజులుగా దీప్తి సునయనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వార్త చూసిన అభిమానులు చాలా కంగారు పడ్డారు. ఆమెకు ప్రమాదం జరిగిందనేది ఆ వార్త సారాంశం. దీనిపై ఎట్టకేలకు దీప్తి స్పందించింది.
Bigg Boss 7 : కన్నీళ్లు పెట్టుకుంటే టాప్-5కు పంపరు.. కంటెస్టెంట్లకు నాగార్జున క్లాస్..!
తనకు ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది. ఆ వార్తలను నమ్మవద్దు అని కోరింది. తాను క్షేమంగా ఉన్నట్లు వెల్లడించింది. అభిమానులు ఎవ్వరూ ఆందోళన పడాల్సిన పని లేదంది. ఓ ఆరు లేదా ఏడేళ్ల క్రితం తాను ‘అలియా ఖాన్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించానని, అందులోని క్లిప్స్‌ను ఆధారంగా చేసుకుని ఇలాంటి పుకార్లను సృష్టించారంది. ఇలా చేయడం కరెక్టు కాదని, ఇలాంటి వార్తలను ఎలా సృష్టిస్తారంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసింది.
LEO : విదేశాల్లో ‘లియో’ సంచలనం.. రిలీజ్‌కు ముందే బాక్సాఫీసు రికార్డు
మలాలా యూసఫ్‌జాయ్.. జీవిత కథ ఆధారంగా అలియా ఖాన్ షార్ట్ ఫిలిం తెరకెక్కింది. అందులో దీప్తి సునయన ఆస్పత్రిలో ఉండే సన్నివేశాలు ఉన్నాయి. ఆ షార్ట్ ఫిలింలోని ఫోటోలు తీసుకుని ఆమెకు ప్రమాదం జరిగి ఆస్పత్రిలో ఉన్నట్లు అసత్య వార్తలు క్రియేట్ చేశారు. అసలు నిజం ఏంటి అనేది దీప్తి సునయన చెప్పడంలో అందరికి ఓ క్లారిటీ వచ్చేసింది.
