Bigg Boss 7 : క‌న్నీళ్లు పెట్టుకుంటే టాప్‌-5కు పంప‌రు.. కంటెస్టెంట్ల‌కు నాగార్జున క్లాస్‌..!

ఎంతో ఘ‌నంగా ప్రారంభ‌మైంది తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ (Bigg Boss ) సీజ‌న్ 7. మొద‌టి వారం పూర్తి కావ‌డానికి వ‌చ్చింది.

Bigg Boss 7 : క‌న్నీళ్లు పెట్టుకుంటే టాప్‌-5కు పంప‌రు.. కంటెస్టెంట్ల‌కు నాగార్జున క్లాస్‌..!

Bigg Boss 7

Bigg Boss Telugu 7 : ఎంతో ఘ‌నంగా ప్రారంభ‌మైంది తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ (Bigg Boss ) సీజ‌న్ 7. మొద‌టి వారం పూర్తి కావ‌డానికి వ‌చ్చింది. ఒక‌టి రెండు టాస్కుల‌తో పాటు చిన్న, చిన్న గొడ‌వ‌లు జ‌రిగాయి. వీకెండ్ ఎపిసోడ్‌కు ముస్తాబైంది. ఇంటి స‌భ్యుల‌తో ముచ్చ‌టించేందుకు హోస్ట్ నాగార్జున వ‌చ్చేశారు. వారం రోజుల పాటు కంటెస్టెంట్లు హౌస్‌లో ఏం చేశారో, ఎలా ఆడారో చెప్పుకొచ్చారు. వాళ్ల‌కు చిన్న‌గా కౌంట‌ర్లు కూడా వేశారు. ఇందుకు సంబంధించిన ప్రొమో విడుద‌లైంది.

LEO : విదేశాల్లో ‘లియో’ సంచ‌ల‌నం.. రిలీజ్‌కు ముందే బాక్సాఫీసు రికార్డు

ఈ ప్రొమోలో కిర‌ణ్ రాథోడ్ హౌస్‌లో తెలుగులో మాట్లాడ‌డం లేద‌ని చెప్పాడు. ఆమెను ఓ ప‌ది తెలుగు ప‌దాలు చెప్ప‌మ‌ని అడిగారు. అయితే.. ఆ ప‌దాలు చెప్పేందుకు ఆమె ఇబ్బంది ప‌డింది. అలాగే నైట్ టైమ్‌లో ష‌కీలా చేసిన హంగామా గురించి మాట్లాడారు. ఇంట్లో ఎప్పుడైన మీ ఆవిడ చెప్పులు మోశావా అంటూ సందీప్‌ను అడిగారు. గౌత‌మ్ కృష్ణ‌ను ఉద్దేశిస్తూ.. నువ్వు హౌస్‌లో ఉన్నావా.. లేక ఒక‌రి వెంట ఉన్న‌వా అంటూ ప్ర‌శ్నించారు.

Dinesh Karthik : జ‌వాన్ సినిమాపై దినేశ్ కార్తీక్‌.. 5 సంవ‌త్స‌రాలు.. ఎన్నో డిస్క‌ష‌న్లు, మ‌రెన్నో..

ఈ మాట విన‌గానే హౌస్‌లో ఉన్న‌వాళ్లంతా ముసి ముసిగా న‌వ్వుకున్నారు. తొలి వారం నుంచి క‌న్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్‌ని ప్రేక్ష‌కులు టాప్-5కు ఇప్ప‌టి వ‌ర‌కు పంప‌లేద‌ని శోభాశెట్టికి నాగార్జున చెప్పారు. దీంతో హౌస్ మొత్తం ఒక్క‌సారిగా సైలెంట్ అయ్యింది.