Ilaiyaraaja : ఢిల్లీ హైకోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ..
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు (Ilaiyaraaja) ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
- Thota Vamshi Kumar
- Updated on- July 1, 2026 / 06:58 PM IST
Delhi High Court refuses to lift injunction against Ilaiyaraaja over ownership of songs from 134 films
- ఢిల్లీ హైకోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ
- గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయడానికి నిరాకరించిన న్యాయస్థానం
Ilaiyaraaja : ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అన్నక్కిలి, 16 వయతినిలే సహా 134 సినిమాల పాటలను ఉపయోగించుకునే హక్కు ఇళయరాజాకు లేదని పేర్కొంటూ, తాము గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు యథాతథంగా కొనసాగనున్నాయి.
1976 నుంచి 2001 మధ్య ఇళయరాజా సంగీతం అందించిన సుమారు 134 చిత్రాలకు సంబంధించి సంగీత, సౌండ్ రికార్డింగ్ హక్కులు తమకే ఉన్నాయని పేర్కొంటూ సరిగమ ఇండియా లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆయా చిత్రాల నిర్మాలతో తాము అధికారిక ఒప్పందాలు కుదుర్చుకుని, ఆ కృతులపై ప్రపంచ వ్యాప్త, శాశ్వత కాపీరైట్‌ను పొందినట్లు ఆ సంస్థ పేర్కొంది.
Sri Gouri Priya : ఫ్లోరిడా బీచ్‌లో మ్యాడ్ భామ.. గౌరి ప్రియా క్యూట్ ఫోటోలు వైరల్..
పలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ పాటలను తనవిగా చెప్పుకుంటూ ఇళయరాజా అప్‌లోడ్ చేయడం చట్టవిరుద్ధమని సరిగమ వాదించింది. 1957 కాపీరైట్ చట్టం ప్రకారం.. ఓ సినిమా కోసం సృష్టించిన సంగీతానికి నిర్మాతకే తొలి హక్కు ఉంటుందని ఆ కంపెనీ న్యాయవాది వాదించారు. దీనిపై విచారణ జరిపిన అనంతరం ఢిల్లీ హైకోర్టు మద్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
కాగా.. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాటిని ఎత్తివేయాల్సిన అవసరం లేదని తెలిపింది. తుది తీర్పు వెలువడే వరకు ప్రస్తుతం ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
