Mounika Yadav Saami Saami
Saami Saami : దేవిశ్రీ ప్రసాద్ పాటల్లో రీసెంట్ గా తెలంగాణ మార్క్ కంపోజిషన్ బాగా కనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించే ఫోక్ బాణీలు.. తెలుగు రాష్ట్రాలనే కాదు…. దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లను కూడా ఇప్పటికీ ఊపేస్తూనే ఉన్నాయి. అలాంటి తన మార్క్ జానపద బాణీలకు … లేటెస్ట్ గా తెలంగాణ బ్రాండ్ ను తగిలించి కిక్ స్థాయి పెంచేస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్.
Pushpa Movie : యూత్‌కి స్లో పాయిజన్.. ‘సామీ సామీ’ అని ఎన్నిసార్లు పిలిచిందంటే సామీ…
సరిలేరు నీకెవ్వరు సినిమాలో… హి ఈజ్ సో క్యూట్ పాటను మధుప్రియతో పాడించాడు. మెదక్ జిల్లాకు చెందిన యువ సింగర్ శ్రావణికి.. తన తమిళ ప్రోగ్రామ్ “స్టార్ టు రాక్ స్టార్ ” షోలో పాడే బంపరాఫర్ ఇచ్చాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు మంత్రి కేటీఆర్ నుంచి కూడా అభినందనలు దక్కించుకున్నాడు దేవిశ్రీ ప్రసాద్. లేటెస్ట్ గా.. సుకుమార్ దర్శకత్వంలో… అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో… తెలంగాణ యువ జానపద గాయనికి అవకాశం ఇచ్చి మళ్లీ ఈ సెగ్మెంట్‌లో హాట్ టాపిక్ అయ్యాడు దేవిశ్రీ ప్రసాద్.
నువ్ అమ్మీ.. అమ్మీ అంటుంటే.. నీ పెళ్లాన్నైపోయినట్టుందిరా సామీ .. సామీ అంటూ పాటపాడిన ఈ తెలంగాణ ఫోక్ సింగర్ పేరు మౌనిక యాదవ్. సొంత జిల్లా కరీంనగర్. ప్రాపర్ హుజూరాబాద్ సెగ్మెంట్ కమలాపూర్ దగ్గర కానిపర్తి గ్రామం. పెరిగింది గోదావరిఖని. జమ్మికుంటలో టెన్త్, డిగ్రీ పూర్తిచేసింది. మౌనిక యాదవ్ మంచి డాన్సర్ కూడా. ఆమె అక్క కూడా మంచి సింగర్. స్కూల్ డేస్ నుంచే తల్లిదండ్రులు, టీచర్లు వీరిని ఆటపాటల్లో ప్రోత్సహించారు. తెలంగాణ ఉద్యమంలో మౌనిక యాదవ్ పాడిన పాటలు ఎంతోమందిలో ఉత్తేజం నింపాయి.
మౌనిక యాదవ్ పాడిన జానపద పాటలు, డీజే పాటలు… యూట్యూబ్ లో లక్షలు, మిలియన్లలో వ్యూస్ సంపాదించాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వ తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం చేస్తూ.. సింగింగ్ కెరీర్ కొనసాగిస్తోంది మౌనిక.
Pushpa : ‘సామి సామి’ అంటూ పుష్పరాజ్ తో చిందేసిన శ్రీవల్లి
నేను కాలికి కట్టిన గజ్జెలా… నా గుండెల్లో మోగిన చప్పుడు పాట చాలామందికి ఫేవరెట్. ఈ ఫోక్ టాలెంట్ ను గుర్తించిన దేవిశ్రీ ప్రసాద్.. సామీ సామీ పాటను మౌనికతో పాడించాడు. ఆమె హస్కీ వాయిస్ లోని బేస్… చంద్రబోస్ రాసిన తెలంగాణ పదాల స్పష్టమైన ఉచ్ఛారణ కారణంగా…. పాటలోని జోష్.. బుల్లెట్ వేగంతో… చెవుల్లోకి అక్కడినుంచి గుండెల్లోకి దూసుకెళ్లిపోయింది. అక్కడే హాంట్ అవుతోంది. పాట బీట్ ఇప్పటికే షార్ట్ వీడియో ఫార్మాట్లు సహా.. అన్ని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలలో హిట్టు అయిపోయింది. దీంతో.. ఈసారి యూట్యూబ్ లోనే కాకుండా… తెలుగు సినిమా ఇండస్ట్రీలోనూ మంగ్లీ, మధుప్రియ, తర్వాత మరో తెలంగాణ టాలెంట్ ట్రెండింగ్ లోకి వచ్చినట్టయింది.