×
Ad

Pawan Kalyan – Sai Dharam Tej : పదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమా.. సాయి ధరమ్ తేజ్ చేయాల్సి వచ్చింది..

పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి గతంలో అని యాంకర్ అడగ్గా దేవాకట్టా సమాధానమిస్తూ..

  • Published On : April 19, 2024 / 02:21 PM IST

Deva Katta Says Interesting Facts about Sai Dharam Tej Movie and Pawan Kalyan

Pawan Kalyan – Sai Dharam Tej : వెన్నెల, ప్రస్థానం.. లాంటి పలు మంచి సినిమాలతో దర్శకుడు దేవాకట్టా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరగా సాయి ధరమ్ తేజ్ తో ‘రిపబ్లిక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ రిపబ్లిక్ సినిమా 2021 లో రిలీజయింది కాని పదేళ్ల క్రితమే ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేయాల్సిందట. తాజాగా దేవాకట్టా(Deva Katta) ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సంగతి తెలిపారు.

పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి గతంలో అని యాంకర్ అడగ్గా దేవాకట్టా సమాధానమిస్తూ.. ప్రస్థానం సినిమా తర్వాత అప్పుడే రిపబ్లిక్ స్టోరీ రాసుకుంటున్నాను. కలెక్టర్ పాత్రతో రాసుకున్నాను. KS రామారావు గారు పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్లారు. పవన్ గారికి ఈ కథ వినిపించాను. అయితే కలెక్టర్ అంటే కొన్ని రిస్ట్రిక్టెడ్ పవర్స్ ఉంటాయి. సినిమాటిక్ పరంగా ఆ పాత్ర అన్నీ చేయలేకపోవచ్చు, చేస్తే వర్కౌట్ అవ్వకపోవచ్చు అని చెప్పారు. కథ నచ్చినా ఆ పాత్ర మీద సందేహంతో ముందుకు వెళ్ళలేదు. అదే రిపబ్లిక్ సినిమాని ఇంకా బాగా రాసుకొని సాయి ధరమ్ తేజ్ తో తీసాను. భవిష్యత్తులో ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాను అని తెలిపారు.

Also Read : NTR : పర్సనల్ ట్రైనర్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన ఎన్టీఆర్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన ట్రైనర్..

దీంతో పవన్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. రిపబ్లిక్ సినిమా ఎప్పుడో పవన్ చేయాల్సిందా? చేసి ఉంటే బాగుండేది, పొలిటికల్ మైలేజ్ కూడా వచ్చేదేమో అని భావిస్తున్నారు. ఇక రిపబ్లిక్ సినిమా 2021లో వచ్చి మంచి విజయం సాధించింది. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ వచ్చి ప్రమోట్ చేయడం గమనార్హం.