Purushaha: పురుషః మూవీ నుంచి ‘దేవ నాయకి’ సాంగ్ రిలీజ్.. అదిరిపోయిన ఐటెం నంబర్
పురుషః(Purushaha) మూవీ నుంచి 'దేవ నాయకి' ఐటెం సాంగ్ ను విడుదల చేసిన మేకర్స్.
- V Santhosh Kumar
- Published On : February 27, 2026 / 09:24 PM IST
DevaNayaki song released from Purushaha movie
Purushaha: పవన్ కల్యాణ్ బత్తుల హీరోగా ఎంట్రీ ఇస్తున్నలేటెస్ట్ మూవీ పురుషః(Purushaha). అనైరా గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు వీరు ఉలవల తెరకెక్కిస్తున్నాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమాను బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, పాటలు ఆడియన్స్ ను ఒక రేంజ్ లో మెప్పిస్తున్నాయి.
Sravanthi Chokkarapu: రెడ్ కలర్ చీరలో నాజూకు వయ్యారం.. యాంకర్ స్రవంతి హాట్ ఫొటోలు వైరల్
ఈనేపథ్యంలోనే, తాజాగా పురుషః సినిమా నుంచి దేవ నాయకి అంటూ సాగే ఎనర్జిటిక్ పాటను విడుదల చేశారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్ అందించిన అద్భుతమైం ట్యూన్ కి అనంత్ శ్రీరామ్ అంతే అద్భుతమైన లిరిక్స్ ని అందించాడు. సాహితి చాగంటి పాడిన ఈ పాటకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ సాంగ్ మంచి వ్యూస్ సాధిస్తోంది. అలాగే ఈ సాంగ్ సినిమాపై అంచనాలను కూడా పెంచుతోంది. ఇప్పిటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.
